Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం అధినేత ఒవైసీ: కొత్తగా ఆ రెండు స్థానాల్లో పోటీ

హైదరాబాద్: తెలంగాణలో కొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం (AIMIM పార్టీ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. కొత్తగా పోటీ చేసే మరో రెండు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.

చాంద్రాయణ గుట్ట నుంచి అక్బరుద్దీన్​ ఒవైసీ, నాంపల్లి నుంచి మాజీద్ హుస్సేన్​, చార్మినార్​ నుంచి మాజీ మేయర్ జుల్ఫికర్​, యాకత్​పురా నుంచి జాఫర్​ హుస్సేన్ మిరాజ్ పోటీ చేయనున్నారు. మలక్‌​పేట నుంచి అహ్మద్​ బలాల, కార్వాన్​ నుంచి కౌసర్​ మొయినుద్దీన్ పోటీ చేస్తారని అసదుద్దీన్ తెలిపారు. బహదూర్​పూరా, జూబ్లీహిల్స్​, రాజేంద్రనగర్​ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోయే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

 aimim party mla candidates list for telangana assembly election; contesting from two more new seats

ఒకటి రెండు రోజల్లో ప్రచారం ప్రారంభిస్తామని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సిట్టింగ్​ ఎమ్మల్యేలైనా పాషా ఖాద్రీ, ముంతాజ్​ హేమంత్​ ఖాన్​ ఈసారి ఎన్నికల బరిలో నిలబడటం లేదని తెలిపారు. తాము పోటీ చేయబోయే ప్రతి స్థానంలో గెలుస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు. కాగా, జూబ్లీహిల్స్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు ఎంఐఎం నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

ఈ సందర్భంగా అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. వచ్చే ఏడాది జనవరిలో అయోధ్య మందిర ప్రారంభ కార్యక్రమానికి ప్రధానీ మోడీ వెంట కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీని తీసుకెళ్లాలను డిమాండ్ చేశారు. బాబ్రీ మసీదు మొత్తం అంశంలో బీజేపీ, కాంగ్రెస్​ల పాత్ర ఉందని ఆరోపించారు. కాంగ్రెస్​ హయాంలో అనేక సార్లు కర్ఫ్యూ విధించారని మండిపడ్డారు.

1990 నుంచి 2012 వరకు 113 సార్లు కర్ఫ్యూలు విధించారని అసదుద్దీన్ తెలిపారు. కానీ, గడిచిన తొమ్మిదేళ్లలో తెలంగాణలో భైంసా రాత్రి వేళల్లో ఒకసారి.. కోవిడ్‌​లో మరోసారి విధించారని పేర్కొన్నారు. ఇందులోనే తెలుస్తుంది రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులున్నాయని అన్నారు. ప్రజా సమస్యలు తీర్చడంలో ఎంఐఎం ఎప్పుడు ముందుంటుందన్నారు. ఈసారి తప్పకుండా పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు గతంలోనే ఒవైసీ పేర్కొన్న విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+