హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్మగ్లింగ్: ఎయిరిండియా ఉద్యోగి వద్ద 4కిలోల బంగారం, రూ.3.6లక్షలు స్వాధీనం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ఎయిరిండియా ఉద్యోగి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. రూ.1.34 కోట్ల విలువైన 4.194 కిలోల స్మగల్డ్‌ చేస్తున్న బంగారం, 3.6 లక్షల దేశీయ కరెన్సీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌(డీఆర్‌ఐ హెచ్‌జీయూ) అధికారులు సీజ్‌ చేశారు.

 Air India employee arrested for smuggling gold at shamshabad airport

హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ బయట, వీటిని పట్టుకెళ్తున్న ఎయిరిండియా శాట్స్‌ ఉద్యోగి నుంచి వీటిని అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగితో పాటు, బంగారాన్ని తీసుకోవడానికి వచ్చిన మరో ఇద్దరిని కూడా డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు.

ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఉద్యోగి ఎప్పడి నుంచి ఇలాంటి కార్యకలాపాలు చేపడుతుంది? ఈ బంగారాన్ని, నగదును ఎక్కడికి చేరవేస్తున్నారు? అనే విషయాలపై లోతుగా విచారిస్తున్నారు అధికారులు.

English summary
Air India employee arrested for smuggling gold at shamshabad airport on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X