వామ్మో.. జస్ట్ మిస్.. శంషాబాద్ లో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం.. !

భారత్ లో ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ విమానం కుప్పకూలి ఏడుగురు భక్తులు మృతి చెందారు. అంతేకాక ఇటీవల అనేక విమానాలు సాంకేతిక సమస్యలతో రద్దయ్యాయి. దీంతో విమాన ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు.

తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం రన్ వే పైకి రాగానే సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.

హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ వెంటనే స్పందించి.., రన్ వే పైనే విమానాన్ని నిలిపి వేశారు. దీంతో పెను ప్రమాదం నుంచి విమానం బయటపడింది. టేక్ ఆఫ్ అవ్వకముందే లోపం బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే మరో విమానంలో ప్రయాణికులను ముంబై తరలించింది ఎయిర్ ఇండియా సిబ్బంది.

Air India Flight Escapes Major Disaster at Shamshabad Airport

మరోవైపు తాజాగా ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. దిల్లీ నుంచి పుణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. దిల్లీ నుంచి పుణే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. అయితే విమానం పుణేలో ల్యాండిగ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+