నోట్ల రద్దుపై అక్బరుద్దీన్ ఆగ్రహం
నోట్ల రద్దుపై అక్బరుద్దీన్ ఆగ్రహం
హైదరాబాద్: రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారిలో అధికులు నల్లధనవంతులేనని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. పెద్దనోట్ల రద్దుపై తెలంగాణ అసెంబ్లీలో చేపట్టిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో చాలా రాజకీయపార్టీలు నగదు వసూలు చేస్తున్నాయని, ఇది అవినీతి కాదా? అని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని, ఇది ముమ్మాటికి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని అన్నారు. దేశంలో బీజేపీ ఏది చెబితే అదే జాతీయవాదం.. బీజేపీని వ్యతిరేకిస్తే దేశద్రోహం అనే ధోరణి కొనసాగుతోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications