హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దేత్తడి హారిక షాకింగ్ నిర్ణయం: TSTDC బ్రాండ్ అంబాసిడర్ పదవికి గుడ్‌బై, ఏమన్నారంటే..?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్ 4 కంటెస్టెంట్, ప్రముఖ యూట్యూబ్ స్టార్ అలేఖ్య హారిక(దేత్తడి హారిక) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్ పదవి నుంచి తాను తప్పుకుంటున్నట్లు హారిక ప్రకటించారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పంచుకున్నారు.

నమస్తే పీపుల్ అంటూ దేత్తడి హారిక

నమస్తే పీపుల్ అంటూ దేత్తడి హారిక

'నమస్తే పీపుల్. ఒక చిన్న క్విక్ అప్‌డేట్. మీ అందరికీ తెలిసిందే.. మహిళా దినోత్సవం రోజున తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్టీడీసీ) బ్రాండ్ అంబాసిడర్‌గా నన్ను నియమించిన విషయం. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక నుంచి సిరీస్‌లపై ఎక్కు దృష్టి సారిస్తాను' అని దేత్తడి హారిక వెల్లడించారు.

మహిళా దినోత్సవం రోజునే హారిక నియామకం

మహిళా దినోత్సవం రోజునే హారిక నియామకం

కాగా, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఇటీవల అలేఖ్య హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం, ఆ ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న హారికను తెలంగాణ పర్యటక అభివృద్ధి సంస్థ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ ఆ సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఆమెకు నియామక పత్రం అందించారు. అయితే, నిర్ణయం వివాదాస్పదంగా మారింది.

దేత్తడి హారిక నియామకం వివాదాస్పదం

దేత్తడి హారిక నియామకం వివాదాస్పదం

బ్రాండ్ అంబాసిడర్ నియామకం విషయంలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గానీ, సీఎంవో అధికారులకు గానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీరియస్ అయిన మంత్రి శ్రీనివాస్, సీఎస్.. శ్రీనివాస్ గుప్తాను వివరణ కోరారని తెలిసింది. ఈ క్రమంలో బ్రాండ్ అంబాసిడర్‌కు వివరాలను టీఎస్ టీడీసీ వెబ్‌సైట్ నుంచి తొలగించారు. అయితే, ఆ తర్వాత హారికను తొలగించలేదని, మంత్రులకు, ఉన్నతాధికారులకు ఈ విషయంపై తెలిపానని శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. ఈ నియామకంపై గిట్టనివారే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వాటిని నమ్మొద్దని అన్నారు.

వారంతా ఉండగా.. మనస్తాపంతోనే హారిక తప్పుకున్నారా?

వారంతా ఉండగా.. మనస్తాపంతోనే హారిక తప్పుకున్నారా?

అయితే, ఈ పరిణామాల నేపథ్యంలో హారిక ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. హారికను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంపై సోషల్ మీడియాలో పలువురు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన హారిక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎవరెస్ట్, కిలిమంజారో లాంటి పర్వతాలను అధిరోహించిన మలావత్ పూర్ణ, మిస్ ఇండియాగా ఎంపికైన వారణాసి మానస లాంటివారిని ఎంపిక చేసుకోవచ్చు కదా అని పలువురు నెటిజన్లు సూచిస్తున్నారు.

English summary
Youtube star and BB Telugu 4 finalist Alekhya Harika has stepped down as the ambassador of Telangana State Tourism Development Corporation (TSTDC). Alekhya was announced as the brand ambassador of TSTDC on Women's Day (March 8).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X