నగరవాసులకు అలర్ట్.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ బంద్..
హైదరాబాద్‌లోని నగరవాసులకు ముఖ్య గమనిక.. నేడు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగనున్నట్లు అధికారులు తెలిపారు. చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల కారణంగా నగరంలోని ఉప్పల్, మల్కాజిగిరి విద్యుత్ ఉండదని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు. రామంతాపూర్ సబ్‌స్టేషన్ పరిధిలోని చర్చికాలనీ ఫీడర్‌లో నేటి (నవంబర్ 23) ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ ఉండదని ఏఈ తెలిపారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాలకు కూడా విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడడున్నట్లు పేర్కొన్నారు.
కుషాయిగూడ లోని 11కేవీ పెద్ద చర్లపల్లి ఫీడర్ పరిధిలో నేటి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు చర్లపల్లి సబ్‌స్టేషన్ ఏఈ ఏ.బాబు రావు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను కూడా విడుదల చేశారు.

రాంపల్లి ఫీడర్ పరిధిలో కూడా నేటి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. భరత్ నగర్ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు విద్యుత్ ఉండదని ఆయన తెలిపారు. కాప్రాలోని సైనిక్‌పురి ఫీడర్ పరిధిలో గల సైనిక్‌పురి-1, 2, 3, 4, 5 ఎవెన్యూలలో నేటి (శనివారం) ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఉంటుందని సైనిక్‌పురి సబ్‌స్టేషన్ ఏఈ పేర్కొన్నారు.
ఉప్పల్
ఉప్పలోని బోడుప్పల్ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా నేడు విద్యుత్ బంద్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 11 కేవీ మారుతీనరగ్ ఫీడర్, 11కేవీ బొల్లిగూడెం ఫీడర్, 11 కేవీ సరస్వతినగర్ ఫీడర్, 11 కేవీ వివేకానంద ఫీడర్ పరిధిలో నేటి (శనివారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ ఉండదని విద్యుత్ ఏఈ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications