వాహనదారులకు అలర్ట్... రేపు నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు..
హైదరాబాద్‌లోని వాహనదారులకు ఓ ముఖ్య గమనిక.. రేపు నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు (సోమవారం) ముస్లింల పవిత్ర పండుగైన బక్రీద్ సందర్భంగా అధికారులు పలు ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించేందుకు పలు ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రార్థనలు జరిగే పరిసర ప్రాంతాల్లో వాహనాలను వేరే దారుల్లోకి మళ్లిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
సోమవారం నాడు బక్రీద్ సందర్భంగా హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రార్ధనలు జరిగే మీరాలం ఈద్గా పరిసర ప్రాంతాల్లో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు పోలీసులు వివరించారు. పాతబస్తీలోని పలు రోడ్లపై వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నట్లు అధికారులు చెప్పారు. రేపు ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల వరకు మీరాలం ఈద్గా ప్రాంతంలో వాహనాలను వేరే మార్గాలకు మళ్లించనున్నట్లు పేర్కొన్నారు. బహదూర్‌పురా క్రాస్ రోడ్ మీదుగా ఉదయం 8:00 గంటల నుంచి 11:30 గంటల మధ్య పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ వైపు నుంచి ఈద్గాకు ప్రార్థనల కోసం వచ్చే వారిని మాత్రమే అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రార్థనలకు వచ్చేవారికి పార్కింగ్ సౌకర్యం కోసం జూ పార్కు, మసీద్ అల్హా హో అక్బర్ ఎదురుగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ప్రత్యేక పోలీసు బందోబస్తు...
సోమవారం (జూన్ 17) ముస్లింల పవిత్ర పండుగైన బక్రీద్ సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పాతబస్తీలో సోమవారం నాడు సుమారు 1000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని వారు తెలిపారు. ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించే మీరాలం ఈద్గా వద్ద ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేయనున్నారు. ఇక, ఈ ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు సుమారు 30,000ల మందికి పైగా హజరయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications