రెండో రోజు దంచికొట్టిన వాన: హైదరాబాద్ రోడ్లు జలమయం, జనానికి తప్పని తిప్పలు

హైదరాబాద్: నగరంలో బుధవారం కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఇంకా కురుస్తూనే ఉంది. నగరంలోని మెహిదీపట్నం, గోషామహల్‌, మంగళ్‌హాట్‌, ఆసిఫ్‌నగర్, జియాగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట, సికింద్రాబాద్, ప్యాట్నీసెంటర్‌, బేగంపేట, అల్వాల్‌, చిలకలగూడ, తిరుమలగిరి, బోయిన్‌పల్లి, మారేడుపల్లిలో ప్రాంతాల్లో వర్షం పడుతోంది.

హైదరాబాద్‌లో పొంగిపొర్లిన నాలాలు

భారీ వర్షంతో పలు చోట్ల వాన నీరు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. భారీ వర్షానికి నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. పలుప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పనుల మీద బయటకు వెళ్తున్న వాహనదారులు వరద నీటితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో కొన్ని చోట్ల వానకు నాలాలు పొంగి ఆ నీరంతా రోడ్లపైకి చేరుతోంది. మురుగు కంపు కొడుతున్న నీటివల్ల నగరవాసులు అవస్థలు పడుతున్నారు.

రోడ్లు, ఇళ్లల్లోకి మురుగునీరు.. జనం ఆందోళన

నాలా నీళ్లు రోడ్లు, ఇళ్లల్లోకి చేరుడుతోండటంతో దోమల బెడద పెరుగుతోందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వైరల్, టైఫాయిడ్, డెంగ్యూ జ్వరాలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దీనికి శాశ్వత పరిష్కారం చూపి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని వేడుకుంటున్నారు.

తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

ఇది ఇలావుండగా, హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరు, శుక్రవారాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి... బుధవారం బలహీనపడిందని వాతావరణ సంచాలకులు తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసర ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో బుధవారం ఆవర్తనం ఏర్పడి సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని తెలిపారు. రాగల 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+