అలివేలు స్వార్థంలేని పారిశుధ్ద్య కార్మికురాలు.!మేయర్ విజయలక్ష్మి భావోద్వేగం.!
హైదరాబాద్ : కార్వాన్ సర్కిల్ నానల్ నగర్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికురాలు ఏడుమేకల అలివేలు ఆకస్మిక మృతికి నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంతాపం తెలిపారు. శనివారం కార్మికురాలి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాడ సానుభూతి తెలిపారు. అనంతరం ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులరర్పించారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ...కరోనా సమయంలో రోడ్ల పైన నివసిస్తున్న అనేక మంది పేదలకు తన వంతు సహాయం చేసిన కార్మికురాలు అని కొనియాడారు. అంతే కాకుండా తన సొంత నెల జీతం మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సీఎం సహయనిధికి ఇచ్చి గౌరవ మంత్రి కేటీఆర్ చే మెప్పు పొందారన్నారు మేయర్ విజయలక్ష్మి.
అంతే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి వర్యులు తన్నీరు హరీశ్ రావు చేతుల మీదుగా ఉత్తమ కరోనా వారియర్ అవార్డును అలివేలు అందుకున్నారని మేయర్ తెలిపారు. ఈ సందర్భంగా అలివేలు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మానవత్వంతో పనిచేసే మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వం జీహెచ్ఎంసీ, వారి కుటుంబానికి అండగా ఉంటుందని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ స్వామి యాదవ్, డిప్యూటీ కమిషనర్, ఏ.ఎం.ఓ.హెచ్ తదితరులు పాల్గొన్నారు.













Click it and Unblock the Notifications