రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపించింది. పోలింగ్‌కు ఇంకో రెండు రోజులే మిగిలివున్నాయి. ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ సాయంత్రానికి ప్రచారానికి తెర పడుతుంది. 30వ తేదీన పోలింగ్. చివరి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం హోరెత్తనుంది.
30వ తేదీన పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ జిల్లా యంత్రాంగం చురుగ్గా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలింగ్ ప్రక్రియ కోసం సన్నాహాలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి పెట్టింది.
*In view of the Telangana Assembly Elections 2023, all educational institutions in Hyderabad district will remain closed on 29th and 30th Nov 2023.*
— Collector Hyderabad (@Collector_HYD) November 28, 2023
*Regular activities resume on 1 Dec 2023.*@TelanganaCS @CEO_Telangana
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటన్నింట్లోనూ పోలింగ్ సజావుగా సాగడానికి కసరత్తు పూర్తి చేశారు అధికారులు. ఇందులో భాగంగా- జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలకు సెలవును ప్రకటించారు.
ఈ నెల 29, 30 తేదీల్లో అంటే బుధ, గురువారాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇచ్చినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెల్లడించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 1వ తేదీన అంటే శుక్రవారం నాడు యధాతథంగా పాఠశాలలు, కళాశాలలు తెరచుకుంటాయని వివరించారు.












Click it and Unblock the Notifications