ఎమ్మెల్సీ పోరులో గెలుపెవరిది - మారుతున్న లెక్కలు, ఉత్కంఠ..!!
ఎమ్మెల్సీ పోలింగ్ కు సర్వం సిద్దమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎమ్మెల్సీ పోరు రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంది. గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మూడు సీట్లలో విజయం తమదేనని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, స్వతంత్రులు సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. దీంతో, ఎమ్మెల్సీ పోరు రాజకీయంగా ప్రతిష్ఠాత్మకంగా మారింది.
పోలింగ్ షురూ
తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. కరీంనగర్, మెదక్, నిజామా బాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించిన పోలింగ్ మొదలైంది. సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజ కవర్గంలో 3,55,159 మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులు ఓటు వేసేందుకు 499, ఉపాధ్యాయులకు 274 కలిపి మొత్తం 773 కేంద్రాలను సిద్ధం చేశారు. ఇందులోని 93 కామన్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి.

హోరా హోరీ
నల్లగొండ- వరంగల్- ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో మొత్తం 25,797 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నియోజకవర్గం 12 జిల్లాల్లోని 191 మండలాల్లో విస్తరించగా మొత్తం 200 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, ఓటింగ్ నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు ఎన్నికల కోసం మొత్తం 90 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వి.నరేందర్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డి, బీఎస్పీ అఽభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి సర్దార్ రవీందర్‌సింగ్ సహా 56 మంది బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం చివరి నిమిషం వరకు హోరా హోరీగా ప్రచారం కొనసాగింది.
మారుతున్న లెక్కలు
ఇదే జిల్లాలకు చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మల్క కొముర య్య , పీఆర్‌టీయూ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డి, జాక్టో అభ్యర్థి ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్‌రెడ్డి సహా 15 మంది పోటీ చేస్తున్నారు. అదే విధంగా నల్లగొండ -వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ స్థానానికి 19 మంది పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి (టీఎస్ యూటీఎఫ్), పింగళి శ్రీపాల్‌రెడ్డి (పీఆర్‌టీయూటీఎస్), గాల్‌రెడ్డి హర్షవర్థన్‌రెడ్డి (టీపీఆర్‌టీయూ), పులి సర్వోత్తంరెడ్డి (బీజేపీ), పూల రవీందర్ (మాజీ ఎమ్మెల్సీ, బీసీ జేఏసీ), సుందర్‌రాజ్‌యాదవ్, తో పాటుగా మరో 13మంది బరిలో నిలిచారు. ఇక్కడ ఫలితం పైన ఉత్కంఠ నెలకొంది.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications