Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వారివి క్షుద్రరాజకీయాలు.!మైకుల ముందు ఉరకుక్కల్లా ఒర్రుతున్నరు.!మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.!

హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపి పార్టీలపై మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో స్పష్టత ఇవ్వకుండా కేంద్రం డ్రామాలాడుతుంటే ఒక్క మాట మాట్లాడని బీజేపి టీఆర్ఎస్ ప్రభుత్వంపైన నిందలు మోపే ప్రయత్నం చేస్తోందని రాష్ట్ర బీజేపి నేతలపైన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ నేతలు వరి ధాన్యం గురించి ఎవరిని ప్రశ్నించాలో తెలియని గందరగోళ పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి వరి దాన్యం కొనుగోలులో రెండు జాతీయ పార్టీల వైఖరిని ఎండగట్టారు.

రైతులతో బీజెపి దొంగాట.రైతుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలన్న జగదీష్ రెడ్డి

రైతులతో బీజెపి దొంగాట.రైతుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసే కుట్రలన్న జగదీష్ రెడ్డి

స్థానిక సంస్థల కోటాలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలు లాంఛనా ప్రాయమేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నిర్ణయించిన టిఆర్యస్ అభ్యర్థి యం.సి కోటిరెడ్డి గెలుపు ఇప్పటికే ఖాయమైందన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు విపక్షాలకు చెంప పెట్టులా ఉండాలని ఆయన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థలకోటాలో శాసనమండలికి జరుగుతున్న ఎన్నికల నిమిత్తం బుధవారం సాయంత్రం దేవరకొండ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమే.. ఫలితం విపక్షాలకు చెంపపెట్టు కావాలన్న మంత్రి జగదీష్

ఎమ్మెల్సీ ఎన్నిక లాంఛనమే.. ఫలితం విపక్షాలకు చెంపపెట్టు కావాలన్న మంత్రి జగదీష్

స్థానిక శాసనసభ్యులు నేనావత్ రవీంద్ర నాయక్ అధ్యక్షత న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులతో బిజెపి దొంగాట ఆడుతుందని ఆరోపించారు. ఇక్కడి ప్రజలు అమాయకంగా లేరని విజ్ఞతతో ప్రవర్తిస్తున్నారని, అది అమయకం అనుకుంటే వారికి గుణపాఠం తప్పదని జగదీష్ రెడ్డి హెచ్చరించారు. యావత్ భారత దేశంలో6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. తెలంగాణ కంటే ఆరు రేట్లు పెద్దదిగా ఉన్న ఉత్తరప్రదేశ్, ఐదు రేట్లు పెద్దదిగా ఉన్న మధ్యప్రదేశ్, ఆ తరువాత స్థానం లో ఉన్న కర్ణాటక రాష్ట్రలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయా అంటూ ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రాలాలలోనే కదా నల్లగొండ జిల్లా రైతాంగం బిజెపి నేతలను తరిమికొట్టిందని ఆయన గుర్తు చేశారు.

ఉత్తమ్ అడగాల్సింది కేంద్రాన్ని.. తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్న మంత్రి

ఉత్తమ్ అడగాల్సింది కేంద్రాన్ని.. తెలంగాణ రాష్ట్రాన్ని కాదన్న మంత్రి

బీజేపి నాయకులు రైతుల మనోనిబ్బరాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. ముమ్మాటికీ వారివి క్షుద్ర రాజకీయాలే నని వాటిని ఎండగట్టేందుకు గులాబీ దండు సన్నద్ధం కావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. మైకుల ముందు ఉరకుక్కల్లా అరుస్తున్న విపక్షాలను బిజెపి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదో తేల్చిచెప్పేదాక నిలదీయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ రోజు లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వంచే ధాన్యం కొనుగోలు చేయించాలని మాట్లాడడం విడ్డురంగా ఉందన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు, తరువాత వ్యవసాయ ఉత్పత్తులు ఏ విదంగా పెరిగాయి అన్నది ఆయన విస్మరించినట్లుందన్నారు జగదీష్ రెడ్డి.

ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలి.. లీడర్, క్యాడర్ సన్నద్ధం కావాలన్న జగదీష్ రెడ్డి

ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలి.. లీడర్, క్యాడర్ సన్నద్ధం కావాలన్న జగదీష్ రెడ్డి

తెలంగాణ విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకీ నెట్టి వ్యవసాయం పట్ల రైతాంగానికి ఉన్న విశ్వసనీయత ను దెబ్బతీసేందుకు బిజెపి మోసపూరిత కుట్రలకు తెర లేపిందన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దొంగే దొంగా దొంగా అన్న చందంగా కేంద్రం రైతాంగంతో దొంగాట అడుతున్నందునే ఇక్కడి రైతాంగాన్ని ప్రత్యామ్నాయ పంటల వైపు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఇటువంటి పరిస్థితిలను ఎప్పటికప్పుడు గ్రామీణ స్థాయిలో ప్రజలకు వివరిస్తూ రైతాంగాన్ని చైతన్యపరిచేందుకు టిఆర్యస్ లీడర్, క్యాడర్ సమాయత్తం కావాలన్నారు. శాసన మండలి సభ్యులు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+