శ్రీతేజ్ ఆరోగ్యం విషమం - ఆస్పత్రికి అల్లు, కీలక నిర్ణయం..!!
ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న శ్రీతేజ్ ను ఎట్టకేలకు అల్లు కుటుంబం పరామర్శించింది. తానే శ్రీతేజ్ ను పరామర్శించి.. ఆ కుటుంబానికి అండగా నిలుస్తానని అల్లు అర్జున్ ప్రకటించారు. కానీ, అల్లు అరవింద్ కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామ ర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే, శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు వివరించారు.
అల్లు అరవింద్ పరామర్శ
సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను సినీ నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పుష్ప 2 ప్రీమియర్స్‌లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. డిసెంబర్ 4 నుంచి అతడు హాస్పిటల్‌లోనే ఉన్నాడు. ఇదే కేసులో హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసారు. ఒక రాత్రి అల్లు అర్జున్ జైలులోనే గడిపారు. హైకోర్టు బెయిల్ తో బయటకు వచ్చారు.

అన్ని రకాలుగా అండగా
ఆ తరువాత రేవతి కుటుంబానికి అండగా నిలుస్తామని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శిస్తానని వెల్లడించారు. అయితే, కేసు కారణంగా అల్లు అర్జున్ ఆస్పత్రికి రాలేదని.. అల్లు అర్జున్ తరపు తాను వచ్చినట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఎటువంటి సహాయం అవసరమైనా తమకి సాధ్యమైనంతవరకూ చెయ్యడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. కేసు విచారణలో ఉన్నందున ఆ బాలుడ్ని, బాధిత కుటుంబాన్ని కలవకూడదన్న సలహా మేరకు అల్లు అర్జున్ రాలేదని అల్లు అరవింద్ వివరించారు.
పరిస్థితి విషమం
అయితే, కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో శ్రీతేజ్ మెదడుకు ఆక్సిజన్ సరిగ్గా అందటం లేదని పేర్కొ న్నారు. బాలుడిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. ఐసీయూలో వెంటిలేటర్ పైన ఉన్న శ్రీతేజ్ కు ఆస్పత్రి సిబ్బంది ట్యూబ్ ద్వారా ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్యం విషమంగా ఉండటంతో అల్లు అరవింద్ ఆస్పత్రికి వచ్చి బాలుడి తాజా పరిస్థితి పైన వైద్యులతో చర్చించారు. బాలుడు కోలుకోవాలని ఆకాంక్షించారు.












Click it and Unblock the Notifications