అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్; చిరంజీవి ఫ్యామిలీతో సహా.. ఓటేసిన సినీ ప్రముఖులు!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పండుగ కొనసాగుతుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు, ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు, సినిమా సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందరికీ ఎన్నికల పండుగలో ఓటు వెయ్యాలని చెప్తున్నారు.

జూబ్లీహిల్స్ లో సినీ నటుడు అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని bsnl పోలింగ్ బూత్ లో అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్లో లైన్లో నిలబడి మరీ అల్లు అర్జున్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అక్కడ ఈవీఎం సమస్యతో ఇబ్బంది తలెత్తగా క్యూలైన్లో నిలబడిన అల్లు అర్జున్ ఎట్టకేలకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 Allu Arjun, Jr. NTR; Including Chiranjeevi family etc film celebrities voted in in telangana election polling

ఓబుల్ రెడ్డి స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఓటర్లతో కలిసి క్యూలైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకోవటం ఆసక్తిని కలిగించింది. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, ఎన్టీఆర్ సతీమణి, ఎన్టీఆర్ తల్లి ఓటు వేయడానికి వచ్చారు . షాద్ నగర్లో సినీ నటుడు ప్రకాష్ రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

మణికొండలోని పోలింగ్ బూత్ లో హీరో వెంకటేష్ ఓటేసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పబ్లిక్ స్కూల్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా జూబ్లీహిల్స్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా ఎల్లపెల్లి లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లో ఎమ్మెల్సీ కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా అభ్యర్థులతో పాటు సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+