Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సమంత-చైతు విడాకులు..!! కౌన్సిలింగ్ పూర్తి : ఫలించని నాగ్ ప్రయత్నాలు- ముంబాయికి షిఫ్ట్..!!

టాలీవుడ్ మరో ప్రముఖ జంట విడిపోతున్నారా. ఇప్పటికే ఈ మేరకు డెసిషన్ జరిగిపోయిందా. కొద్ది రోజులు ఈ వ్యవహారం మీద రూమర్లు వినిపిస్తున్నా..తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు సమంత-చైతూ విడిపోవాలనే నిర్ణయించారని తెలుస్తోంది. ఈ మేరకు వారిద్దరూ విడాకులకు నిర్ణయం అయిపోయిందని చెబుతున్నారు. వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి వివాహం చేసుకున్నారు. ఇక, సహజంగా సినీ ఫీల్డ్ లో ఇద్దరూ టాప్ స్థాయిలో ఉన్నప్పుడు వచ్చే ఇగో ప్రాబ్లమ్స్..ఈ ఇద్దరి మధ్య మొదలై అవి ఇప్పుడు విడాకుల దాకా వెళ్లాయి.

SaraAliKhan: బికినీ తో మాల్దీవులో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు .. (ఫొటోస్)

సమంత-చైతు పరస్పరం విడాకులు కోరుతూ..

సమంత-చైతు పరస్పరం విడాకులు కోరుతూ..

ఇప్పటికే ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసారు. ఇద్దరికీ తొలి విడత కౌన్సిలింగ్ సైతం పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఈ విడాకుల వ్యవహారం నడుస్తున్న సమయంలోనే ఇక టాలీవుడ్ ను వదిలేసి..పూర్తిగా ముంబాయిలోనూ ఉంటూ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టాలని సమంత నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా వెబ్ సిరీస్ పైన ప్రస్తుతం సమయంత పూర్తిగా ఫోకస్ పెట్టారు.

ఫలించని నాగార్జున ప్రయత్నాలు

ఫలించని నాగార్జున ప్రయత్నాలు

కొద్ది రోజులుగా ఈ వ్యవహారం పైన రూమర్లు నడుస్తున్నా...నాగ్ కుటుంబ సభ్యులు ఎవరూ దీని పైన స్పందించ లేదు. తాజాగా చైతన్య-సాయి పల్లవి నటిస్తున్న ఒక సినిమాకు సంబంధించి బెస్ట్ విషెస్ చెప్పిన సమంత అందులో కేవలం సాయి పల్లవిని మాత్రమే ఉద్దేశించి ట్వీట్ చేసింది. దీంతో..చైతన్య పేరు ప్రస్తావించటానికి సైతం సమంత ఇష్టపడటం లేదనే ప్రచారం ఉంది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్ లో చైతన్య సిన్సియర్ గానే సమంతను ఇష్టపడుతున్నారని...అయితే, ఇద్దరి మధ్య వచ్చిన చిన్నపాటి సమస్యలు ఇంత దూరం తెచ్చాయనేది ఇండస్ట్రీ టాక్.

నాగార్జున- బిగ్ బాస్ పై ప్రభావం..

నాగార్జున- బిగ్ బాస్ పై ప్రభావం..

అసలు సమంత-చైతన్య వివాహమే అప్పట్లో నాగార్జునకు ఇష్టం లేదనే ప్రచారం సాగింది. కానీ సమంత కోసం తాను దేనికైనా సిద్దమంటూ చైతన్య భీష్మించుకొనే సరికి నాగ్ సైతం అంగీకరించాల్సి వచ్చింది. నాగార్జున తొలి వివాహం కూడా బ్రేక్ అయింది. ఆ తరువాత అమల ను చేసుకున్నారు. అఖిల్ ఇష్టపడిన అమ్మాయితో ఎంగేజ్ మెంట్ దాకా వచ్చిన వ్యవహారం సైతం బ్రేక్ పడింది. ప్రస్తుతం బిగ్ బాస్ షో కు హోస్ట్ గా చేస్తున్న నాగార్జున సైతం ఒకింత డల్ గానే కనిపిస్తున్నారు. పైకి ఎంత కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా...మనసులోని బాధ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.

డిసప్పాయింట్ మెంట్ లో నాగ్..

డిసప్పాయింట్ మెంట్ లో నాగ్..

ఇప్పుడు సమంత- చైతు విడిపోవాలని డిసైడ్ అవ్వటంతో నాగార్జున డిసప్పాయింట్ అయినట్లుగా తెలుస్తోంది. ఇద్దరితోనూ నాగార్జున పలు మార్లు మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నాలు చేసారు. కానీ, అవి ఫలించలేదు. ఇదే సమయంలో..సమంత తన ట్విట్టర్‌లో అక్కినేని అని ఎప్పుడైతే తీసేసిందో.. అప్పటి నుంచే విడిపోతార నే ప్రచారం మొదలైంది. విడాకుల ప్రాసెస్‌కు కోర్టులో కొంత సమయం పడుతుంది కాబట్టే.. ఈ వార్తలపై ఎవరూ స్పందించడం లేదని తెలుస్తోంది.

Recommended Video

    T20 World Cup 2021:Sourav Ganguly Explains MS Dhoni’s Appointment As India’s Mentor| Oneindia Telugu
    ప్రస్తుతం చెన్నై .. త్వరలో ముంబాయికి షిఫ్ట్..

    ప్రస్తుతం చెన్నై .. త్వరలో ముంబాయికి షిఫ్ట్..

    ప్రస్తుతం సమంత, చైతూకి దూరంగా ఉండేందుకు హైదరాబాద్ వదిలేసి, చెన్నైలో నివాసం ఉంటోందని, త్వరలోనే వీరి విడాకుల ప్రకటన అధికారికంగా రానుందని తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు టాలీవుడ్ లో ప్రముఖ కుటుంబంగా ఉన్న అక్కినేని ఫ్యామిలీలో సమంత -చైతు విడాకుల వ్యవహారం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సినీ ఇండస్ట్రీలో ఇలా విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నా... ఇప్పుడు వీరిద్దరి అంశం మాత్రం ఆసక్తి కరంగా మారుతోంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+