Crop Loan Waiver: దేవుళ్లపై ఒట్టేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారా..! రుణ మాఫీపై రైతుల ఆందోళన..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించింది. రైతు డిక్లరేషన్ లో భాగంగా రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక లోక్ సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణ మాఫీ(Crop Loan Waiver) చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేశారు. ఆగస్ట్ 15 లోపు రుణ మాఫీ చేస్తామని స్పష్టం చేశారు. రైతు రుణ మాఫీకి రూ.31 వేల కోట్లు అవుతాయని అంచనా వేశారు. మూడు విడతల్లో రుణ మాఫీ చేస్తామన్నారు.
మొదటి విడతలో రూ.లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. రెండో దఫాలో రూ.1.50 లక్షల వరకు రుణం మాఫీ చేస్తామని.. మూడో విడతలో రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. మూడు విడతల్లో రుణాలు మాఫీ చేశారు. అయితే సగం మంది రైతులకు రుణా మాఫీ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. రూ.31 వేల కోట్లు ఖర్చు అవుతాయని లెక్కగట్టి చివరకు మూడు విడతల్లో కలిపి రూ.17,933 కోట్లే విడుదల చేశారు. అంటే ఇంకా దాదాపు సగం నిధులు విడుదల చేయాల్సి ఉంది.

చాలా మంది రైతులకు రుణ మాఫీ కాలేదు. కానీ ప్రభుత్వం మాత్రం రుణ మాఫీ అయినట్లుగా ప్రకటించుకుందని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామానికి చెందిన చెక్కిళ్ల లచ్చయ్యకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపెళ్లిలోని ఇండియన్ బ్యాంకులో రూ.1.80 క్రాఫ్ లోన్ తీసుకున్నారు. తను క్రమం తప్పకుండా రెన్యూవల్ చేసినా తనకు రుణ మాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ఏఈఓను సంప్రదించగా.. తమకు సరైన సమాచారం లేదని లేదన్నారు. దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఇదే విషయమై డీఏఓను సంప్రదించగా.. స్థానిక ఏఈఓను సంప్రదించాలని.. రుణ మాఫీ కానీ వారి గురించి త్వరలో మార్గదర్శకాలు వస్తాయన్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు లక్షలాది మందికి రుణ మాఫీ కాలేదు. దేవుళ్ల ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో చెప్పాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా రైతులకు పంట నష్టపరిహారం విడుదల చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా.. రైతుల ఖాతాల్లో జమ కాలేదు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే వ్యవసాయ శాఖకు భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications