హోదాపై కేసీఆర్ నీతిసుత్రాలా.. దీని మాటేమిటి, నవ్వుతున్నారు: దిమ్మతిరిగేలా బీజేపీ

హైదరాబాద్: ఇచ్చిన మాట తప్పడం, కుటుంబ పాలన, అవినీతి.. ఇదేనా తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో కోరుకుంటున్న గుణాత్మక మార్పు అని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్ దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోడీ హవా చూసి కేసీఆర్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

అన్ని ప్రాంతాలు, మతాల ప్రజలు ప్రధాని మోడీ పాలనను మెచ్చి బీజేపీని వరుసగా గెలిపిస్తున్నారని చెప్పారు. దేశంలో గుణాత్మక మార్పు తీసుకొస్తుంది మోడీనే అన్నారు. హోదాపై నీతిసూత్రాలు చెబుతున్న కేసీఆర్.. దళితుడిని సీఎంగా చేస్తానని, ఇంటికో ఉద్యోగమని చెప్పి ఏం చేశారని నిలదీశారు.

చాలా ఫ్రంట్‌లు చూశాం

చాలా ఫ్రంట్‌లు చూశాం

ప్రధాని నరేంద్ర మోడీ హవాను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు గుబులు పట్టుకుందని కే లక్ష్మణ్ ఆదివారం అన్నారు. కేసీఆర్ చెబుతున్న ఫ్రంట్‌లు చాలా చూశామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గాలి తెలంగాణకు పాకడం ఖాయమైందని, మరోవైపు కాంగ్రెస్ కూడా పుంజుకుంటుందని కేసీఆర్ గుర్తించారని అందుకే ఇలా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ఫ్రంట్ అంటున్నారని, ఇలాంటి ఫ్రంట్‌లు ఎన్నో చూశామన్నారు.

కేసీఆర్ బీరాలు

కేసీఆర్ బీరాలు

కేసీఆర్ మాటలను చూస్తుంటే తన నాలుగేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారని కేసీఆర్ గుర్తించారని, ఇలాంటి సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని ప్రజలు తెలుసుకున్నారని, ఇలాంటి సమయంలో కేసీఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు ఫ్రంట్ అంటూ మాట్లాడుతున్నారన్నారు.
ఫ్రంట్‌లు అన్నీ మూడు రోజుల ముచ్చటే అన్నారు. ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ బీరాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఓటమి స్థాయిలో ఉన్న పార్టీలతో ఫ్రంట్ అంటున్నారన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు.

బీజేపీ విజయాలతో కేసీఆర్‌కు భయం, తల్లికి అన్నం పెట్టనోడు

బీజేపీ విజయాలతో కేసీఆర్‌కు భయం, తల్లికి అన్నం పెట్టనోడు

బీజేపీ విజయయాత్రను చూసి కేసీఆర్ భయపడుతున్నారని చెప్పారు. ఉద్యమస్ఫూర్తితో ఏర్పడిన పార్టీ కాబట్టి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానని, ఇంటికో ఉద్యోగం అని కేసీఆర్ చెప్పారని, అవి ఏమయ్యాయని ప్రశ్నించారు.
తల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి గాజులు తెస్తా అన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. తెలంగాణకు ఏం చేయకుండానే దేశానికి చేస్తానని చెప్పడం విడ్డూరమన్నారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్‌తో అన్నారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన పాపాల్లో కేసీఆర్ పాత్ర లేదా అన్నారు.

నువ్వా నీతులు చెప్పేది

నువ్వా నీతులు చెప్పేది

పాత చింతకాయ పచ్చడి అయిన కమ్యూనిస్టులతో కలుస్తామని చెప్పడం కేసీఆర్ అభద్రతా భావానికి సంకేతం అన్నారు. కేసీఆర్ చెబుతున్న గుణాత్మకమైన మార్పును తీసుకు వచ్చింది ప్రధాని మోడీ అన్నారు. ఆయన ప్రజల మద్దతుతో ముందుకు వెళ్తున్నారన్నారు. దీనిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. తెలంగాణకు ఏం చేయని కేసీఆర్ నీతులు చెప్పడం విడ్డూరమన్నారు. మాటల గారడితో ఎంతోకాలం ప్రజలను మోసం చేయలేరన్నారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు అంటే పార్టీల ఫిరాయింపులా అని ఎద్దేవా చేశారు. ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, జైలుకు పంపించడం గుణాత్మకమైన మార్పులా అని కేసీఆర్‌ను నిలదీశారు. టెంటులు, ఫ్రంటులు అని కేసీఆర్ అంటుంటే జనాలు నవ్వుకుంటున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+