Ambedkar: ‍హైదరాబాద్‍ను దేశానికి రెండో రాజధాని చేయాలి.. అంబేడ్కర్ మనవడు డిమాండ్..

అంబేడ్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద సీఎ కేసీఆర్ 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహన్ని అవిష్కరించారు. అంబేడ్కర్ పేరిట అంబేడ్కర్ జయంతి రోజున ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తామని సీఎం తెలిపారు. అంబేడ్కర్ అవార్డుల కోసం రూ. 51 కోట్లు డిపాజిట్ చేస్తామని హామీ ఇచ్చారు. డిపాజిట్ తో వచ్చే రూ.3 కోట్ల డబ్బులతో ఆవార్డులు ఇస్తామన్నారు. ఏటా అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్రంలో ఉత్తమ సేవలు అందించే వారికి ఈ అవార్డులు అందజేస్తామని వివరించారు.

డా బీఆర్ అంబేడ్కర్ విశ్వమానవుడని సీఎం కేసీఆర్ కొనియాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దే అధికారమని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో ఊహించని స్పందన వస్తోందని యూపీ, బిహార్ లో కూడా ఆదరణ వస్తుందన్నారు . విగ్రహ ఏర్పాటుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి సీఎం ధన్యవాదాలు తెలిపారు సీఎం కేసీఆర్. అంతకు ముందు సీఎంకేసీఆర్ శిలాఫలకం ఆవిష్కరించి... ఆ తర్వాత ఆడిటోరియం ప్రధానభవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

prakashambedkari-

లిఫ్టు ద్వారా మహానీయుడి విగ్రహం పాదాల వద్దకు చేరుకొని అక్కడ బౌద్ధగురువుల పూజలు, ప్రత్యేక ప్రార్థనల అనంతరం సుమున్నతంగా పండగ వాతావరణంలో విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహంపై హెలికాప్టర్‌ ద్వారా పూల వర్షం కురిపించారు. అంబేడ్కర్విగ్రహ ఆవిష్కరణలో కార్యక్రమంలో ఆయన మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ పాల్గొన్నారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలని ప్రకాశ్ అంబేడ్కర్ డిమాండ్ చేశారు.

prakashambedkari-

అంబేడ్కర్ హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధానిగా చూడాలనుకున్నారని గుర్తు చేశాడు. భద్రతా కారణాల దృష్ట్యా దేశానికి రెండో రాజధాని అవసరమని నొక్కి చెప్పారు.అంబేడ్కర్ విగ్రహావిష్కరణతో సీఎం కేసీఆర్ కొత్త శకానికి నాంది పలికారన్నారని చెప్పారు. దేశ ప్రజలు సంతోషంగా ఉండాలని .. అందరూ విద్యావంతులు కావాలని అంబేడ్కర్ కోరుకున్నారని గుర్తు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+