నిజామాబాద్ ఐటీ హబ్‌లో గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటు
హైదరాబాద్: ఇటీవల నిజామాబాద్‌లో ప్రారంభమైన ఐటీ హబ్‌లో కంపెనీలను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటికే అనేక సంస్థలు తమ కంపెనీలను ఏర్పాటు చేయగా, తాజాగా అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
పెద్ద నగరాలకు సమానంగా స్థానికులకు అవకాశాలు కల్పించేదుకే ఐటీ హబ్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3000 మంది పనిచేస్తున్నారు.

నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఆ సంస్థ ప్రతినిధులు ఆగస్టు మొదటి వారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటీ హబ్‌ను ఇటీవల సందర్శించారు.
అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు కావడం గమనార్హం. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ సంస్థ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని అన్నారు. ఐటీ అభివృద్ధి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు.
ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని కవిత వివరించారు. గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండానే యువతకు స్థానికంగానే ఉద్యోగ కల్పన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఐటీ హబ్ ఆలోచన చేశారని చెప్పారు. నిజామాబాద్ ఐటీ హబ్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు.

కాగా, గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై మహేష్ బిగాల హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా నిజామాబాద్‌కి గ్లోబల్ లాజిక్ ఏర్పాటు చేసే విషయములో పలు మార్లు సంస్థతో సంప్రదించి త్వరిత గతిన ఏర్పాటుకు మార్గం సులువు చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలిపారు.
ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ స్థానికులకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వివిధ జిల్లాలలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయడానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నఐటీ మంత్రి కేటీఆర్.. ఇక్కడే వివిధ సంస్థలను ఏర్పాటు చేసేందుకు విదేశీ ప్రతినిధులు రావడానికి సహకరించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, ఎమ్మెల్యే బాజీరెడ్డి గొవర్ధన్‌కు మహేష్ బిగాల ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్‌లో తాము కల్పించే ఉద్యోగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో కంపెనీని తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications