ప్రేమ బంధం: ఒక్కటైన అమెరికా అమ్మాయి.. ముత్తారం అబ్బాయి

Subscribe to Oneindia Telugu

పాలకుర్తి: దేశాలు వేరు.. భాషలు వేరు.. అయినా మనసులు కలవడంతో మూడుముళ్లతో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన కల్వల భాస్కర్‌రెడ్డి-శీలారెడ్డి దంపతుల కుమారుడు శశికాంత్‌రెడ్డి 15ఏళ్ల క్రితం అమెరికా వెళ్ళి చదువు పూర్తి చేశాడు.

అక్కడే బ్యాక్సర్‌ మేరీ-అలెన్‌ దంపతుల కుమార్తె కేటీతో కళాశాలలో పరిచయం ఏర్పడింది. ఒకే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా శశికాంత్‌రెడ్డి, కేటీ ప్రేమించుకున్నారు.

 American girl marriage with Mutharam village guy

పెద్దల అంగీకారంతో ఎల్లలు దాటివచ్చి హిందూ సంప్రదాయం క్రారం ముత్తారంలోని స్వగృహంలో గురువారం శశికాంత్‌రెడ్డికి కిేతో వివాహం జరిగింది. ఈ వేడుకలకు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు, మేకలు, గొర్రెల కార్పొరేషన్‌ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య, డీసీసీబీ చైర్మన్‌ జంగారాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎన్‌. సుధాకర్‌రావు, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A American girl has married Mutharam village's guy on Thursday.
Please Wait while comments are loading...