జూ.ఎన్టీఆర్-రామోజీతో భేటీలు-చంద్రబాబుపై స్పెషల్ ఫోకస్-అమల్లోకి అమిత్ షా బిగ్ ప్లాన్ ?
తెలంగాణలో అనుకూలంగా ఉన్న పరిస్ధితుల్ని సద్వినియోగం చేసుకుంటూ ఈసారి ఎన్నికల్లో ఎట్టిపరిస్ధితుల్లో గెలిచి తీరాలని పట్టుదలగా ఉన్న బీజేపీ అసలు వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేస్తోంది. అమిత్ షా తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీలు, చంద్రబాబుకు ఇస్తున్న ఎన్ఎస్జీ అదనపు భద్రత ఇవన్నీ ఇందులో భాగమే. ఈ బిగ్ ప్లాన్ తెలంగాణలో బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అనేది పక్కనబెడితే మారుతున్న రాజకీయం వీరి ప్రత్యర్ధుల్ని మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Recommended Video

తెలంగాణపై అమిత్ షా ఫోకస్
ఇప్పటివరకూ బీజేపీ ధీమాగా ఉన్నఉత్తరాది రాష్ట్రాల్లో మారుతున్న పరిస్ధితులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. అందుకే ఇంతవరకూ సీరియస్ గా ఫోకస్ పెట్టని తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వీలైనన్ని ప్రయోగాలు చేసేందుకు బీజేపీ అధిష్టానం సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే ఓవైపు అధికారంలో ఉన్న కర్ణాటకలో దాన్ని నిలబెట్టుకుంటూనే పొరుగున ఉన్న తెలంగాణలో తొలిసారి అధికారం అందుకునేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అందుకే ఇప్పుడు బీజేపీ శకుని అమిత్ షా ఇప్పుడు వరుసగా హైదరాబాద్ పర్యటనలు చేస్తున్నారు. అక్కడ ఆయన రచిస్తున్న వ్యూహాలు రాజకీయ ప్రత్యర్ధులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.

రామోజీ, జూనియర్ తో అమిత్ షా భేటీలు
తాజాగా హైదరాబాద్ వచ్చిన అమిత్ షా.. టాలీవుడ్ యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు, మీడియా దిగ్గజం రామోజీ రావును కలిశారు. వీరిద్దరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తాజా రాజకీయపరిణామాలపై చర్చించారు. రామోజీరావుతో భేటీలో రాజకీయాల ప్రస్తావన ఎలాగూ ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రం సినిమాలపై చర్చించారని తొలుత బీజేపీ లీకులిచ్చింది. కానీ జరిగింది వేరు. భవిష్యత్తులో తెలంగాణ ఎన్నికలతో పాటు ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వీరిద్దరి సహకారం తీసుకోవాలనేది అమిత్ షా అసలు వ్యూహం.

చంద్రబాబుపై స్పెషల్ ఫోకస్
ఒకప్పుడు బీజేపీతో కలిసి కేంద్ర, రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకుని పోటీ చేసి అధికారం పంచుకున్న చంద్రబాబు ఆ తర్వాత దూరమై అదే పార్టీపై ధర్మపోరాటం చేసి విఫలమయ్యారు. దీంతో మూడేళ్ల పాటు చంద్రబాబును అస్సలు పట్టించుకోని బీజేపీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరనే సత్యాన్ని గ్రహించింది. దీంతో మరోసారి చంద్రబాబుపై స్పెషల్ ఫోకస్ పెడుతోంది. అంతే కాదు ఇప్పుడు చంద్రబాబుకు అదనపు భద్రత కల్పించేందుకు ఎన్ఎస్జీ అధికారుల్ని సైతం ఇంటికి, టీడీపీ కార్యాలయానికి పంపింది. ప్రధానితో చంద్రబాబు భేటీ అయిన తర్వాత చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు సహజంగానే చంద్రబాబును మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చేస్తున్నాయి.

అమిత్ షా బిగ్ ప్లాన్ ఇదే ?
ఇంతకీ అమిత్ షా తాజా హడావిడి వెనుక అసలు ప్లాన్ క్రమంగా అర్ధమవుతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావుతో జరిపిన భేటీల సారాంశం, చంద్రబాబుపై పెడుతున్న ప్రత్యేక ఫోకస్ వెనుక తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్ రాజకీయాలే కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు రంగం సిద్దమవుతోంది. అదే సమయంలో వీరికి ప్రచారం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించేందుకే అమిత్ షా ఆయన్ను పిలిపించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ను వచ్చే ఏడాది ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రంగంలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది. అయితే అది బీజేపీ తరఫున కాకుండా టీడీపీ-బీజేపీ కూటమి తరఫున అనేది ఇక్కడ విశేషం. అలాగే హైదరాబాద్ తో పాటు ఆంధ్రా ఓట్లు ఎక్కువగా ఉండే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో చంద్రబాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఓట్లు కొల్లగొట్టాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటివరకూ కేసీఆర్ కు అండగా నిలుస్తున్న రామోజీరావుకు ఈసారి టీడీపీ-బీజేపీ పొత్తు గురించి చెప్పి ఆయన సాయం తీసుకునేందుకే అమిత్ షా భేటీ అయినట్లు తెలుస్తోంది.
-
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం.. -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications