రజాకార్ల నుంచి విముక్తి: మాధవీలతకు మద్దతుగా హైదరాబాద్‌లో అమిత్ షా రోడ్ షో
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 400 సీట్లలో గెలిపించాలని.. ప్రధాని నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిని చేద్దామని పిలుపునిచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. పాతబస్తీలో పాతుకుపోయి ఉన్న ఎంఐఎంకు ధీటుగా ఇప్పుడు బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారంలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బుధవారం రాష్ట్ర రాజధానిలో రోడ్ షో నిర్వహించారు. లాల్ దర్వాజా మహంకాళి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగింది. అడుగడుగున పెద్ద ఎత్తున జనం నీరాజనం పలికారు. పలువురు మహిళలు బోనాలుతో ఎదురై, స్వాగతం పలికారు. దీంతో రాజధాని రోడ్లన్నీ కాషాయమయమయ్యాయి.

సికింద్రాబాద్, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థులు కిషన్ రెడ్డి, మధవీలతకు మద్దతుగా బుధవారం రాత్రి హైదరాబాద్ నగరంలో అమిత్ షో నిర్వహించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ అమిత్ షా ముందుకు కదిలారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. 40 ఏళ్ల రజాకార్ల పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రజాకార్ల గుప్పిట్లో చిక్కుకుపోయిన హైదరాబాద్కు విముక్తి కలగాలంటే ఈసారి బీజేపీకే ఓటు వేయాలని ఆయన ఓటర్లను కోరారు.
#WATCH | Telangana: Union Home Minister Amit Shah offered prayers at Simhavahini Sri Mahankali temple in Hyderabad. pic.twitter.com/9Wl2WFzPmH
— ANI (@ANI) May 1, 2024
కాగా, ప్రచార సమయం దగ్గరపడటంతో అమిత్ షా ప్రసంగం 5నిమిషాలు మాత్రమే జరిగింది. రోడ్ షో ముగించుకుని అమిత్ షా నేరుగా నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ చేవెళ్ల, నాగర్కర్నూల్, మహబూబ్నగర్ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో నెలకొన్న తాజా పరిస్థితులు, ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
#WATCH | Telangana: Union Home Minister Amit Shah conducts a road show in Hyderabad in support of BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha.#LokSabhaElections2024 pic.twitter.com/uScaj8fTBx
— ANI (@ANI) May 1, 2024
నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు పార్టీ అభ్యర్థుల విజయానికి చేపట్టాల్సిన కార్యాచరణపై అమిత్ షా దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు.
#WATCH | Telangana: During a roadshow in support of BJP candidate from Hyderabad Lok Sabha constituency, Madhavi Latha, Union Home Minister Amit Shah says, "...Nobody needs to be scared, nobody has the guts to touch any person in Hyderabad. This time, vote with a free mind,… pic.twitter.com/ZqQwSwFMzQ
— ANI (@ANI) May 1, 2024
కేంద్రం తీసుకున్న సాహాసోపేతమైన నిర్ణయాలు, తెలంగాణ రాష్ట్రానికి చేసిన సహాయాన్ని వివరించడంతో పాటు కేంద్రంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించేలా పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేశారు. ఈ మీటింగ్ ముగించుకున్న తర్వాత రాష్ట్ర కార్యాలయం నుంచి బేగంపేట ఐటీసీ కాకతీయకు చేరుకుని రాత్రి అక్కడే బస చేయనున్నారు కేంద్రమంత్రి అమిత్ షా. కాగా, ప్రచారానికి ముందు లాల్ దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారిని అమిత్ షా దర్శించుకున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications