ఆ మూడు పార్టీలు ఒక్కటే: అమిత్ షా, భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్: కాంగ్రెస్‌ పాలన అంతా కుంభకోణాల మయమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్​ఎస్​, మజ్లిస్ ఒక్కటేనని, ఆ ‌ మూడు వారసత్వ పార్టీలేనని అన్నారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్​ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు.

తెలంగాణ ప్రజల ఉత్సాహం చూస్తుంటే నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నరేంద్ర మోడీని మూడోసారి ప్రధానిగా చేద్దామని, 400 ఎంపీ సీట్లను ఆయనకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడికెళ్లినా, మోడీ నామస్మరణే మార్మోగుతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు బీజేపీ 12కు తగ్గకుండా ఎంపీ సీట్లు ఇవ్వాలన్నారు.

Amit Shah hits out at congress brs and mim in LB stadium bjp public meeting

కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడలేదని సీఎం రేవంత్ నిరూపించగలరా? అని ఆయన సవాల్ విసిరారు. మజ్లిస్‌ అజెండాతోనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పనిచేస్తాయని అమిత్ షా విమర్శించారు. ఈ మూడు పార్టీలు కేవలం ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తాయని, తమ వారసుల సంక్షేమం గురించి మాత్రమే ఆలోచిస్తాయని విమర్శించారు. మోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల అభివృద్ధి జరిగిందని అమిత్ షా వ్యాఖ్యానించారు.

Amit Shah hits out at congress brs and mim in LB stadium bjp public meeting

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఏడాదికి రూ.6 వేల చొప్పున వేస్తూ, అండగా ఉంటోంది. వచ్చే ఐదేళ్లలో దేశమంతటా, ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు సరఫరా చేస్తుంది. ఇప్పటికే 14 కోట్ల ఇళ్లకు మంచినీటి నల్లా కనెక్షన్లు ఇచ్చాం. పదేళ్ల యూపీఏ పాలనలో తెలంగాణకు రూ.1.17లక్షల కోట్లు మాత్రమే వస్తే.. మోడీ పాలనలో మాత్రం ఇప్పటికే రాష్ట్రానికి రూ.5లక్షల కోట్లు వచ్చాయి. బీజేపీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని అమిత్ షా వ్యాఖ్యానించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా

ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భ అనంతరం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. పూజల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు హైదరాబాద్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత పాల్గొన్నారు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులతో అమిత్ షా భేటీ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 12కుపైగా సీట్లే లక్ష్యంగా నేతలంతా కలిసి పనిచేయాలన్నారు. నేతల మధ్య విభేదాలను పక్కనపెట్టి పార్టీ గెలుపుకోసం పనిచేయాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+