3న బీజేపీ జెండా ఎగరాలి: మోడీ అలా.. కేసీఆర్ ఇలా అంటూ అమిత్ షా
ఆదిలాబాద్: డిసెంబర్ 3న హైదరాబాద్‌లో బీజేపీ జెండా ఎగరాలని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు రావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదిలాబాద్‌లో మంగళవారం నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. కుమురంభీంను స్మరించుకుంటూ ప్రసంగం ప్రారంభించిన అమిత్ షా.. పవిత్ర భూమి ఆదిలాబాద్ రావడం సంతోషంగా ఉందన్నారు.
మోడీ నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడతుందన్నారు అమిత్ షా. కేసీఆర్ వైఖరి కారణంగా గిరిజన వర్సిటీ ఏర్పాటు ఆలస్యమైందన్నారు. గిరిజన వర్సిటీకి కేసీఆర్ సర్కారు స్థలం చూపించలేదని.. అందుకే ఆలస్యమైందని చెప్పారు. మోడీ.. కృష్ణా ట్రైబ్యునల్ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారన్నారు. పదేళ్లుగా కేసీఆర్ తెలంగాణ పేదల సమస్యలు తీర్చలేదన్నారు.

రైతులు, దళితులు, గిరిజనులను కేసీఆర్ పట్టించుకోలేదని అమిత్ షా మండిపడ్డారు. మోడీ ప్రభుత్వం చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిందని అమిత్ తెలిపారు. ప్రతి పేద మహిళకు మోడీ వంటగ్యాస్ ఇచ్చారని.. రైతుల ఖాతాల్లో ఏటా రూ. 6వేలు జమ చేస్తున్నారని చెప్పారు. ఒడిశాలో పుట్టిన నిరుపేద గిరిజన మహిళను మోడీ.. రాష్ట్రపతిని చేశారని అమిత్ షా తెలిపారు.
Addressing the enthusiastic people of Adilabad at 'Jana Garjana Sabha' in Telangana. తెలంగాణలో నిర్వహిస్తున్న 'జన గర్జన' సభలో ఎంతో ఉత్సాహంతో పాల్గొంటున్న ఆదిలాబాద్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న. https://t.co/X9h2rWudGG
— Amit Shah (@AmitShah) October 10, 2023
అయోధ్యలో రామమందిరం కట్టాలా? వద్దా? చెప్పండి? అడ్డంకులను అధిగమించి మోడీ సర్కారు రామమందిరం నిర్మిస్తోంది. ఆర్టికల్ 370 ఎత్తివేసి కాశ్మీర్‌కు విముక్తి కల్పించిందన్నారు అమిత్ షా. సర్జికల్ స్ట్రైక్స్ చేసి శత్రువులను తరిమికొట్టిందన్నారు. తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేశానని కేసీఆర్ చెబుతుంటారు.. రైతులు ఆత్మహత్యల విషయంలో, అవినీతి విషయంలో తెలంగాణను నెంబర్ చేశారని అమిత్ షా విమర్శించారు.
Union Home Minister @AmitShah launches BJP poll campaign at an election rally in Adilabad, #Telangana; While addressing public meeting he calls upon people of the state to elect double-engine government. He also urges people to elect govt that would work for the welfare of… pic.twitter.com/tS5Sts80yn
— All India Radio News (@airnewsalerts) October 10, 2023
కాంగ్రెస్ పేదల గురించి మాట్లాడుతుంది కానీ.. పేదల కోసం ఏమీ చేయదని విమర్శించారు అమిత్ షా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ వాళ్లకు పేదలు గుర్తుకు వస్తారన్నారు. తొమ్మిదేళ్లుగా మోడీ సర్కారుపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవన్నారు. కేసీఆర్ గిరిజనుల కోసం ఎన్నో హామీలిచ్చారు కానీ.. అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ గెలిస్తే కేటీఆర్ సీఎం అవుతారని.. బీజేపీ వస్తే ఆదిబాసీ బిడ్డలకు కొలువులు వస్తాయన్నారు.
కేసీఆర్.. ఆదివాసీలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు? ఇచ్చారా? అని అమిత్ షా ప్రశ్నించారు. దళితులు, గిరిజనుల కోసం మోడీ తొమ్మిదేళ్లుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అమిత్ షా తెలిపారు. కేసీఆర్ మాత్రం పదేళ్లుగా తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉందన్నారు. మజ్లిస్ కనుసన్నల్లో నడిచే బీఆర్ఎస్ ను పీకి పారేసి.. మోడీ నేతృత్వంలోని బీజేపీకి పట్టం కట్టాలని ప్రజలకు అమిత్ షా పిలుపునిచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications