మోడీపై విశ్వాసం ఉంచండి: తెలంగాణ ప్రజలకు అమిత్ షా పిలుపు
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకెళుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వచ్చే 50 ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ కీలక పాత్ర పోషించబోతోందన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో అమిత్ షా మాట్లాడారు.
అనేక రంగాల్లో భారతదేశం అగ్రస్థానానికి చేరబోతోందని అన్నారు అమిత్ షా. మోడీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందని తెలిపారు. బీజేపీ సిద్ధాంతాల ఆధారంగా నడిచే పార్టీనని.. బీఆర్ఎస్కు ఏం విధానం ఉందో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కుటుంబ పార్టీనని.. కేటీఆర్‌ను సీఎం చేయడం తప్ప కేసీఆర్‌కు మరో విధానం అన్నదే లేదని అమిత్ షా విమర్శించారు.

కుటుంబ, అవినీతి పార్టీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దని అమిత్ షా తెలంగాణ ప్రజలను అమిత్ షా కోరారు. మజ్లిస్‌తో దోస్తీ కారణంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ నిర్వహించలేదన్నారు అమిత్ షా. కేంద్రం రెండేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ పోరాటం జరిగిందన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని అమిత్ షా ఆరోపించారు. మోడీ సర్కార్ తెలంగాణకు తొమ్మిదేళ్లలో 9 లక్షల కోట్ల రూపాయలను ఇచ్చిందని అన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ ఏం చేశారని.. ఇక్కడి ప్రజలు అడుగుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదన్నారు.
ఇది అమృత కాలం.. సంకల్పం తీసుకోవాల్సిన కాలమని అమిత్ సా చెప్పారు. బీజేపీ హయాంలో 12 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు. మోడీ ప్రభుత్వం 9 కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందన్నారు అమిత్ షా. నరేంద్ర మోడీ నేతృత్వంలోనే కొవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లను రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారని మండిపడ్డారు. డిజిటల్ పేమెంట్ల వ్యవస్థను దేశవ్యాప్తం చేసిన ఘనత మోడీకే దక్కుతుందన్నారు అమిత్ షా.
The BRS government is a total letdown for the people of Telangana. The state has failed to optimize the opportunities given by the center to develop. Telangana people have understood that forming a BJP government is the only way to break the vicious cycle.
— Amit Shah (@AmitShah) October 10, 2023
Spoke at the… pic.twitter.com/HC4K68Y0UU
బీఆర్ఎస్ ప్రభుత్వ స్టీరింగ్ ఎంఐఎం చేతుల్లో ఉందని అమిత్ షా అన్నారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని.. మోడీపై భరోసా ఉంచి ఈసారి తెలంగాణలో అవకాశం ఇవ్వాలని అమిత్ షా తెలంగాణ ప్రజలను కోరారు. అంతకు ముందు ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జనగర్జన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ సభలోనూ బీఆర్ఎస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
హైదరాబాద్‌లోని ప్రయాణికులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!











Click it and Unblock the Notifications