అమిత్ షా తెలంగాణ టూర్: నల్గొండను టార్గెట్ చేసిన బిజెపి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: ఈ నెల 22 నుండి 24వ, తేదివరకు తెలంగాణ రాష్ట్రంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటించనున్నారు.అయితే తెలంగాణలో ప్రధానంగా మావోయిస్టుల ప్రాబల్యం, వామపక్షాలకు గట్టిపట్టున్న గ్రామాల్లో ఆయన పర్యటించనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో బిజెపి ప్రయత్నాలను ప్రారంభించింది. 2019 ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదనే అభిప్రాయాన్ని ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం చెబుతోంది.అయితే ఎన్నికల నాటికి జాతీయ నాయకత్వం ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందోననే అభిప్రాయం కూడ వ్యక్తమౌతోంది.

ఎన్ డి ఏ లో టిడిపి భాగస్వామ్యంగా ఉంది.ఈ నేపథ్యంలోనే 2014 ఎన్నికల్లో బిజెపి ,టిడిపి కూటమిగా ఏర్పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీచేశాయి. అయితే 2019 నాటికి ఈ రెండు రాష్ట్రాల్లో పరిస్థితుల్లో మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీని బలోపేతం చేసే దిశగా బిజెపి నాయకత్వం అడుగులు వేస్తోంది.ఈ మేరకు బిజెపి బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.ఈ మేరకు అమిత్ షా పార్టీ రాష్ట్ర నాయకులకు దిశా నిర్ధేశం చేయనున్నారు.

నల్గొండను టార్గెట్ చేసిన బిజెపి

నల్గొండను టార్గెట్ చేసిన బిజెపి


నల్గొండ జిల్లాను బిజెపి లక్ష్యంగా చేసుకొంది.బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటన సందర్భంగా నల్గొండ జిల్లాలోని రెండు గ్రామాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా ఒకప్పుడు మావోలకు ప్రాబల్యం ఉన్న గ్రామంతో పాటు వామపక్ష పార్టీకి గట్టిపట్టున్న మరో గ్రామంలో కూడ అమిత్ షా పర్యటించనున్నారు. చండూర్ మండలంలోని తేరటుపల్లి గ్రామంలో దివంగత బిజెపి నేత మైసయ్యగౌడ్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్యరించనున్నారు.మైసయ్య గౌడ్ ను 1999 మార్చిలో మావోయిస్టులు కాల్చిచంపారు. అదే గ్రామంలో గ్రామస్థులతో కలిసి అమిత్ షా సహపంక్తి భోజనం చేయనున్నారు. మరో వైపు అదే జిల్లాలోని గుండ్రాంపల్లి గ్రామంలో కూడ ఆయన పాల్గొన్నారు.ఈ గ్రామంలో రజాకార్లకు వ్యతిరేకంగా గ్రామస్థులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు.

అమిత్ షా టూర్ లో చేరికలు

అమిత్ షా టూర్ లో చేరికలు

వివిద పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు చర్చలు నిర్వహిస్తున్నారు. పార్టీలో చేరాలని ఆహ్వానిస్తోంది. అంతేకాదు తెలంగాణకు జిల్లాలకు చెందిన రెడ్డి సామాజికవర్గానికి చెందిన బలమైన ఇతర పార్టీలకు చెందిన నాయకులతో బిజెపి సంప్రదింపులు జరుపుతోంది.ప్రధానంగా మాజీమంత్రులతో బిజెపి రాష్ట్ర, జాతీయ నాయకులు చర్చిస్తున్నారని సమాచారం.అయితే అమిత్ షా పర్యటన సందర్భంగా కొందరు ఇతర పార్టీలకు చెందిన నేతలు బిజెపిలో చేరేందుకు ప్రయత్నాలను చేస్తోంది ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం.

 హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం పై దృష్టి

హైద్రాబాద్ పార్లమెంట్ స్థానం పై దృష్టి


హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని తాము దక్కించుకోవాలని ఆ పార్టీ వ్యూహారచన చేస్తోంది. హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో బిజెపి ఎందుకు విజయం సాధించడం లేదనే విషయమై ప్రధానంగా చర్చించనున్నారు. అయితే ఈ మేరకు హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని లక్ష్యంగా చేసుకొని బిజెపి వ్యూహాలకు అమిత్ షా పదును పెట్టనున్నారు. హైద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై బిజెపి కేంద్రీకరించి పనిచేయనుంది.

 బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ప్లాన్

బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అమిత్ షా ప్లాన్


తెలంగాణలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసేందుకుగాను ఆ పార్టీ చర్యలను చేపడుతోంది. అమిత్ షా పర్యటన ముఖ్య ఉద్దేశం కూడ ఇదే. హైద్రాబాద్ లో జరిగే బూత్ స్థాయి పదాదికారుల సమావేశంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై ప్రధానంగా చర్చించనున్నారు.ఎంపిక చేసిన పార్టీ కార్యకర్తలకు అమిత్ షా సమావేశానికి హజరుకానున్నారు. వారంతా తమకు కేటాయించిన ప్రాంతాల్లో పార్టీని బలోపేతం చేయనున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp national president Amit shah will tour in Telangana state on 22, 23, 24 May, 2017.Amit shah will participate party programmes in two villages in Nalgonda districts.
Please Wait while comments are loading...