Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రణయ్ హత్య కేసు తీర్పు తర్వాత అమృత షాకింగ్ పని.. భగ్గుమంటున్న నెటిజన్లు

నల్గొండ లోని మిర్యాలగూడలో పరువు హత్యకు గురైన ప్రణయ్ కేసులో తాజాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును వెలువరించింది . ఈ కేసులో ఏ 2గా ఉన్న వ్యక్తికి మరణశిక్ష విధించిన కోర్టు ఈ కేసులో మిగతా వారికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రణయ్ హత్య కేసు తీర్పుతో ఫ్యామిలీ హర్షం
ఇంత కాలానికి న్యాయం గెలిచిందని, తమ కన్నీళ్ళకు పోరాటానికి ఫలితం ఈరోజు తీర్పుగా వచ్చిందని ప్రణయ్ తండ్రి బాలస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. మరోవైపు అమృత కోర్టు తీర్పు తర్వాత ప్రణయ్ హత్య జరిగిన సమయంలో నాడు నల్గొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ కు కాల్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.

Amrutha shocking act after Pranay murder case verdict Netizens are furious

అమృత షాకింగ్ పోస్ట్
తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధి వద్దకు వెళ్లి అంజలి ఘటించి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే అమృత మాత్రం భర్త సమాధి దగ్గరకు వెళ్లలేదు.
తుది తీర్పు వచ్చిన తర్వాత ఇంస్టాగ్రామ్ లో రెస్ట్ ఇన్ పీస్ అని మాత్రమే పోస్ట్ చేశారు. ఇక ఇదే సమయంలో అమృత చేసిన షాకింగ్ పని సోషల్ మీడియాలో ఆమె పైన పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది.

పేరు మార్చుకున్న అమృత
ఇంతకాలం అమృత ప్రణయ్ గా ఉన్న అకౌంట్ పేరును కాస్త అమృత అమృత వర్షిని అనే పేరుగా మార్చేశారు. భర్త మరణం తర్వాత ఫైనల్ తీర్పు రాగానే అమృత ప్రణయ్ అన్న పేరులోని ప్రణయ్ పేరును తీసివేయడంతో నెటిజన్లు కొత్త చర్చ మొదలుపెట్టారు. అమృత కొత్త జీవితం స్టార్ట్ చేసిందని రెండో పెళ్ళికి సిద్ధమైపోయింది అంటూ కొంతమంది ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ప్రణయ్ పేరు తన పేరులో నుండి తీసేసిన అమృత
లేదంటే ఈ సమయంలో ఆమె ప్రణయ్ పేరును తన పేరులో నుంచి ఎందుకు తీసివేసిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇంతకాలం ప్రణయ్ కోసమే బతుకుతున్నట్టుగా చెప్పుకున్న అమృత ఇప్పుడు తన పేరులోంచి ప్రణయ్ పేరును తీసివేయడంతో ఆమె నెక్స్ట్ స్టెప్ ఏమిటి అన్నది ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అమృత తర్వాత ఏం చేస్తుంది అన్నది అందరిలో ఆసక్తి
అయితే తన పేరులోంచి ప్రణయ్ పేరు తీసివేయడం వెనుక కారణం ఏమిటి అన్నది అమృత పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నవారు కూడా తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కొంతమంది ఇంకేముంది అంతా అయిపోయింది.. మళ్లీ పెళ్లి చేసుకుంటుంది అంటుంటే మరి కొంతమంది తను ఏం చెప్పబోతుందో తెలియకుండా తొందరపడి మాట్లాడటం తప్పని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+