హైదరాబాద్ శబరిమల ప్రత్యేక రైలుకు కొత్తగా మరో స్టేషన్‌లో హాల్ట్..!!

Sabarimala temple: కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వెళ్తోన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మాలధారణ చేస్తోన్నారు. నియమ నిష్ఠలతో మణికంఠుడిని కొలుస్తోన్నారు.

మండలం-మకరవిళక్కు మహాపడి పూజల కోసం అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు కిందటి నెల 15వ తేదీన తెరచుకున్న విషయం తెలిసిందే. దీనితో మండలం- మకరవిళక్కు సీజన్ ఆరంభమైంది. స్వామివారిని దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తోన్నారు.

An additional stoppage at Podanur for Hyderabad-Kottayam special train

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు కొల్లం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. భక్తుల రద్దీ పెరిగే కొద్దీ ఈ ప్రత్యేక రైళ్ల సంఖ్యనూ పెంచుకుంటూ పోతున్నారు. తాజాగా మరో 22 అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఇందులో భాగంగా హైదరాబాద్ నాంపల్లి నుంచి కొట్టాయం వరకు ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నెల 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 1:30 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07163 రైలు మరుసటి రోజు సాయంత్రం 6:45 నిమిషాలకు కొట్టాయం చేరుకుంటుంది.

ఈ నెల 21, 28 తేదీల్లో రాత్రి 9:45 నిమిషాలకు కొట్టాయం నుంచి బయలుదేరే నంబర్ 07164 ఎక్స్‌ప్రెస్ మూడో రోజు అర్ధరాత్రి 12:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.

ఈ రైలు- బేగంపేట్, లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్ జంక్షన్, తాండూరు, సేడం, యాద్గిర్, కృష్ణా, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు జంక్షన్, అనంతపురం, ధర్మవరం జంక్షన్, కదిరి, మదనపల్లి రోడ్, పీలేరు, పాకాల జంక్షన్, చిత్తూరు, కాట్పాడి జంక్షన్, జోలర్‌పేట, సేలం జంక్షన్, ఈరోడ్ జంక్షన్, తిరుప్పూర్, పాలక్కాడ్ జంక్షన్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం టౌన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

తాజాగా ఈ ఎక్స్‌ప్రెస్‌కు అదనంగా మరో స్టాపేజీ సౌకర్యాన్ని కల్పించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. తమిళనాడులోని పొడనూర్ జంక్షన్‌లో ఇకపై హాల్ట్ అవుతుంది. రెండు నిమిషాల పాటు ఆగుతుంది. కొట్టాయం వెళ్తున్నప్పుడు అర్ధరాత్రి 12: 28 నిమిషాలకు పొడనూర్ చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో తెల్లవారు జామున 3:31 నిమిషాలకు ఇక్కడికి వస్తుంది. ప్రయాణికుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+