దారుణం: రాష్ డ్రైవింగ్ వద్దన్నందుకు వృద్ధుడిని కొట్టి చంపేశారు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బైక్‌పై రాష్‌గా వెళ్లొద్దని చెప్పినందుకు ఆంజనేయులు అనే వృద్ధుడిపై ఓ యువకుడు ఇష్టానుసారం దాడి చేశాడు. దీంతో తీవ్రగాయాలపాలైన వృద్ధుడు.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు.
పది రోజుల క్రితం దాడి ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. రూ. లక్షలు ఖర్చు చేసినా ప్రాణం దక్కలేదని మృతుడి కుమారుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన తండ్రి మృతికి కారణమైన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఆర్టీసీ బైక్ ఢీకొని ముగ్గురు మృతి
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్-బీజాపూర్ హైవేపై పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ ఇద్దరు యువకులు, ఓ బాలుడు కలిసి బైక్‌పై వెళుతూ ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. దీంతో బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు మేడికొండ, ఒకరు గొంగుపల్లి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు మృతితో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని.. మృతదేహాలను పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications