యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నన్స్ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును ఇటీవల అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. ఇక, గవర్నర్ ఆమోద ముద్ర కూడా లభించడంతో న్యాయ శాఖ గెజిట్ జారీ చేసింది.
తాజాగా, ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆనంద్ మహీంద్రా ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని లక్షలాది మంది యువతకు నైపుణ్యాలు నేర్పించేలా రంగారెడ్డి జిల్లాలో ముచ్చర్లలోని బేగరికంచెలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. 17 రకాల కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ప్రైవేటు సంస్థల్లో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
ఏటా లక్ష మందికి శిక్షణ ఇచ్చేలా రాబోయే కాలంో ఈ వర్సిటీని విస్తరించనున్నారు. బేగరికంచెలో సొంత భవనం పూర్తయ్యే వరకు గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా భవనంలో ఈ వర్సిటీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.












Click it and Unblock the Notifications