హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్ర కేసులో తీర్పు: మరో నిందితుడికి శిక్ష ఖరారు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ కోర్టు మరో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. నిందితుడు సయ్యద్ మక్బుల్ కు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎన్ఏఐ కోర్టు గురువారం తీర్పు వెల్లడించింది.2012తో హైదరాబాద్‌లో పేలుళ్లు జరిపి విధ్వంసం సృష్టించాలని ప్రయత్నించిన ఈ 11 మందితో కూడిన గ్యాంగ్.. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చింది.
అయితే, దీన్ని ముందే పసిగట్టిన తెలంగాణ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితులందరు ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. వీరిలో నలుగురు నిందితులకు జులైలో.. కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. మరో ఆరుగురు నిందితులపై ట్రయల్ కోర్టులో విచారణ జరుగుతోంది.

నిందితులు హైదరాబాద్ లక్ష్యంగా పేలుళ్ల కుట్ర పన్నారని, పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఎన్ఐఏ అధికారులు కోర్టుకు తెలిపారు. కాగా, ముజాహిద్దీన్ కుట్రగా ఈ కేసు ప్రాచుర్యం పొందింది. ఇప్పటికే ఈ కేసులో సయ్యద్ మక్బుల్ ను సెప్టెంబర్ 22వ తేదీన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది. ఇక, ఈ కేసులో ఐదవ నిందితుడిగా ముక్బుల్ ఉన్నాడు.
Accused Sentenced by NIA Special Court in Indian Mujahideen Conspiracy Case. pic.twitter.com/nzfKjjbPgj
— NIA India (@NIA_India) October 26, 2023
నాందేడ్‌కు చెందిన ముక్బుల్‌ను ఉగ్ర కదలికల నేపథ్యంలో ఫిబ్రవరి 28వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, పాకిస్థాన్ ఉగ్ర సంస్థ ముజాద్దీన్ లోని కీలక సభ్యులతో ముక్బుల్ దగ్గరి సంబంధాలు కలిగి ఉన్నట్లు ఎన్ఐఏ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది.












Click it and Unblock the Notifications