కంచ ఐలయ్యపై మరో వివాదం: మా ఇంటికొచ్చి సోదాలు చేసుకో.. టిజి వెంకటేష్
కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై మరో వివాదం తలెత్తింది.
హైదరాబాద్: కోమటోళ్లు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం రాసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై మరో వివాదం తలెత్తింది.
గతంలో ఆయన రచించిన మన తత్వం పుస్తకం న్యాయ వ్యవస్థను అగౌరవ పరిచేలా ఉందంటూ కరీంనగర్‌కు చెందిన లాయర్ బేతి మహేందర్‌రెడ్డి కరీంనగర్ పోలీసు కమిషనర్‌కు, మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుస్తకాన్ని ముద్రించిన పబ్లిషర్స్‌పై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇదిలా కోమటోళ్లు సామాజి స్మగ్లర్లు అనే పుస్తకాన్ని నిషేధించాలని సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది. సుప్రీం న్యాయవాది వీరాంజనేయులు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతూ ప్రజలను రెచ్చగొడుతున్న కంచ ఐలయ్యను అరెస్టు చేయాలని రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ డిమాండ్ చేశారు. వైశ్యుల గురించి ఇష్టమొచ్చినట్లు రాసి, సమర్థించుకోవడం ఆయన మానసికస్థితికి అద్దం పడుతోందన్నారు.
మా ఇంట్లో బాంబులు, మారణాయుధాలు ఉన్నాయని ఆరోపిస్తున్న కంచ ఐలయ్య ఎప్పుడైనా సోదాలు చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. వైశ్యులను లక్ష్యంగా చేసుకుంటున్న ఐలయ్య ఎస్సీలకు ఏం చేశారో చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications