22 వేల కాంట్రాక్ట్ కోసం నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి.. రాజగోపాల్ రెడ్డి మునుగోడు క్షమించదు, పోస్టర్స్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో... పార్టీలు, నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతుంది. సెంటరాఫ్ అట్రాక్షన్ మాత్రం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డే.. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ నెల 21వ తేదీన బీజేపీలో చేరబోతున్నారు. మునుగోడులో అక్కడ పోస్టర్లు వెలిశాయి. అదీ కూడా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కనిపించడం విశేషం. ఇదీ సర్వత్రా చర్చానీయాంశం అయ్యింది.

పోస్టర్స్..
మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టర్స్ వెలిశాయి. అందులో రాజగోపాల్ రెడ్డిని మునుగోడు నిన్ను క్షమించదు అని రాశారు. రూ. 22 వేల కోట్ల కాంట్రాక్ట్ కోసం.. 13 ఏళ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి అని రాసి ఉంది. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను ఈడీ వేధిస్తున్న రోజే అమిత్ షాతో బేరమాడిన నీచుడివి అని స్పష్టంగా పోస్టర్లలో కనిపిస్తోంది. పోస్టర్లు కేవలం మునుగోడులోనే కాదు.. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెలిశాయి. నారాయణపురం, చౌటుప్పల్‌లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్టర్స్ ఎవరూ వేశారనే అంశంపై స్పష్టత రాలేదు.

బుజ్జగించినా నో..
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే వరకు.. బుజ్జగింపుల పర్వం కొనసాగింది. దాదాపు అందరూ నేతలు ఆయనతో మాట్లాడారు. కానీ వినిపించుకోలే.. రాజీనామా చేసేశారు. ఆ వెంటనే దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా చేశారు. ఆయన బీజేపీలో కూడా చేరారు. రాజగోపాల్ రెడ్డితో చాలా మంది బీజేపీలో చేరతారని.. బీజేపీ నేతలు అంటున్నారు. మరీ 21వ తేదీన ఎవరూ చేరతారో చూడాలీ.
Recommended Video


21న బీజేపీలో చేరిక
మునుగోడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజగోపాల్ రెడ్డి రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యిందని అసెంబ్లీ కార్యదర్శి నోటిఫై చేశారు. ఇక మిగిలింది ఉప ఎన్నికే. ఆయా పార్టీలు మునుగోడుపై దృష్టిసారించాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్న సంగతి తెలిసిందే. ఇంతలో పోస్టర్లు వెలిశాయి. నిజంగానే ప్రజలు అలా అనుకుంటున్నారా..? లేదంటే గిట్టనివారు పోస్టర్లు వేశారా అనే అంశం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications