తెలంగాణాలో ఆ ఆలయ అభివృద్ధి పనుల భూమిపూజకు ఏపీ డిప్యూటీ సీఎం!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జనవరి 3వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అంతేకాదు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం 35.19 కోట్ల నిధులతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారు.
కొండగట్టు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ భూమి పూజ
పవిత్రమైన మార్గశిర పౌర్ణమి రోజున ఈ అభివృద్ధిపనులు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్నాయి .ఈ నిధులతో 100గదుల అత్యాధునిక ధర్మశాల నిర్మాణం, అలాగే 2,000మంది భక్తులు ఒకేసారి హనుమాన్ దీక్ష విరమించే భారీ మండపం నిర్మాణం చేయనున్నారు. సుదూర ప్రాంతాల భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక వసతి గృహాలు కూడా ఈ ప్రణాళికలో నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులు ఆలయ మౌలికవసతులను, భక్తుల సౌకర్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయి.

కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అనుబంధం
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంతో పవన్ కళ్యాణ్ కు చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. గతంలో వారాహి వాహనం ఎన్నికల ప్రచార రథం పూజ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామీ ఆలయంలో చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి పార్టీలతో పొత్తును ఆయన ఇదే ఆలయం నుంచి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన తరుణంలో కూడా పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించడం విశేషం.
పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీటీడీ నిధులు
ఈ పర్యటనకు రాజకీయంగా, ఆధ్యాత్మికంగా రెండింటికీ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి సంబంధించి పవన్ కల్యాణ్ రాకతో భక్తులు, ఆయన అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని మాటిచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి టీటీడీ నిధులను ఇచ్చేలా చేశారు.












Click it and Unblock the Notifications