Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కు ఢిల్లీ బిగ్ టాస్క్, టార్గెట్ ఆ ఇద్దరూ- జూబ్లీహిల్స్ లో సీన్ ఛేంజ్..!!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరా హోరీగా మారుతోంది. మూడు ప్రధాన పార్టీలకు ఈ ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఇక్కడ సామాజిక సమీకరణాలే కీలకంగా మారుతున్నాయి. సీఎం రేవంత్ ఇప్పటికే ప్రచారంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేస్తూనే... మిత్రపక్షాలు టీడీపీ, పవన్ సహకారం కోరుతున్నాయి. ఏపీ నుంచి వచ్చి స్థిర పడిన వారి ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో... బీజేపీ పవన్ ను రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ నిర్ణయం కీలక మలుపుగా మారుతోంది.

జూబ్లీహిల్స్ లో గెలుపును సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే నియోజకవర్గం లో ప్రచారం ఊపందుకుంది. మాగంటి సునీత గెలుపు బాధ్యతలను కేటీఆర్ తన భుజస్కంధాలపై వేసుకొని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నా... ఏపీలో తమకు మిత్ర పక్షాలుగా ఉన్న టీడీపీ, జనసేన సహకారం తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ లీడర్లు ఢిల్లీకి సమాచారం ఇచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సెటిలర్ల ఓట్లు కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమకు చెందిన వారు గణనీయంగా ఉన్నారు. మూడు లక్షల మంది ఓటర్లలో సీమాంధ్ర ఓటర్లు లక్షన్నరకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇక్కడ సామాజిక వర్గాల వారీగా మద్దతు కోసం పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ముస్లీం మైనార్టీ వర్గాల తరువాత అత్యధికంగా ఉన్నట్లు పార్టీలు చెబుతున్నాయి.

ap-dy-cm-pawan-kalyan-likely-to-campaign-in-jubilee-hills-for-bjp-candidate

నియోజకవర్గ పరిధిలో సినీ పరిశ్రమకు చెందిన వారు 30వేలు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25వేల మందికిపైగా ఉన్నారు. వారి ఓట్లను ఆకట్టుకోవాలంటే పవన్ ను ప్రచారానికి రప్పిస్తే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలోకమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగానే ఉన్నారు. మరోవైపు సినీ రంగానికి చెందిన వారు.. కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువే. ఆ ఓట్లన్నీ బీజేపీ వైపు తిప్పికోవాలంటే టీడీపీ సహకారంతో పాటుగా పవన్ కల్యాణ్ ను రంగంలోకి దింపాలని బీజేపీ వ్యూహాన్ని రచిస్ తున్నట్లు తెలుస్తోంది. కమ్మ వర్గానికి చెందిన కొందరు ముఖ్యులు తాజాగా సీఎం రేవంత్ ను కలిసి మద్దతు ప్రకటించారు. అయితే, బీజేపీ నేతలు కోరితే పవన్ నేరుగా ప్రచారంలోకి వస్తారా.. లేక మద్దతు కోరుతూ ప్రకటన చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ నేతలు మాత్రం ఢిల్లీ ముఖ్యులు పవన్ తో ప్రచారం.. మద్దతు పైన మాట్లాడుతారని చెబుతున్నారు. 9వ తేదీతో ఇక్కడ ప్రచారం పూర్తి కానుంది. దీంతో, బీజేపీ ఇచ్చే టాస్క్ పైన పవన్ నిర్ణయం.. ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+