తెలంగాణ పుణ్యమా అని ఆంధ్రా అభివృద్ధి: కెటిఆర్, ప్రభుత్వ కాలేజీల్లో ఉచిత విద్య
హైదరాబాద్: ఏపీలో అభివృద్ధి జరుగుతోందంటే అదంతా తెలంగాణ పుణ్యమేనని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోకుండా ఉంటే అభివృద్ధి చెందేవా? అని ప్రశ్నించారు. విభజన వల్ల అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణలో అభివృద్ధి జరుగుతోందన్నారు.
ఓ రకంగా ఆంధ్రాలో అభివృద్ధికి తెలంగాణయే కారణమన్నారు. ఆంధ్రాలో ఇవాళ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం రావడానికి, ఐఐటీ, ఐఐఎంలు వచ్చాయనడానికి తెలంగాణ, ఆంధ్రా రెండుగా విడిపోవడమే కారణమన్నారు.
ఉప్పల్ నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్ని మల్లాపూర్‌లోని వీఎన్‌ఆర్ గార్డెన్‌లో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి మహేందర్ రెడ్డి, మంత్రి కెటిఆర్ తదితర నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని ఉప ముఖ్యమంత్రి సీఎం కడియం శ్రీహరి అన్నారు. మోడీకి రానురాను ప్రజల్లో ఆదరణ తగ్గిపోతోందన్నారు. మోడీ ప్రధాని కాగానే మొదట ఢిల్లీలో ప్రజలు ఓడించారని, ఆ తర్వాత బీహార్లో ఓడారన్నారు.
తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో విద్య ఉచితం
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. ఈ ఏడాది నుంచి అమలు చేయనున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్రంలో 402 కళాశాలల్లో 1,15,111 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 80 శాతం మంది బిసి, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు.












Click it and Unblock the Notifications