కేసీఆర్ ఓటమి.. ఏపీ మంత్రిపై భారీ ట్రోలింగ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించింది. అందరీ అంచనాలు తలక్రిందులు చేస్తూ రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడానికి సిద్దం అవుతుంది. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితం అయ్యేలా కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే మంత్రి రోజాపై భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడంతో ఏపీ మంత్రి రోజా ట్రెండింగ్‌లోకి వచ్చారు. తెలంగాణలో ఎన్నికల సమమంలో మంత్రి రోజా కేసీఆర్ మద్దతుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని తెలంగాణ ప్రజలను అభ్యర్థించారామె.

రోజా అక్కడితో ఆగకుండా.. కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యలు చేశారు. . బీఆర్ఎస్‌కి ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. కచ్చితంగా భారత రాష్ట్ర సమితి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే ఆమెకు పూర్తి భిన్నంగా వచ్చాయి. దీంతో రోజా వ్యతిరేకులు ఆమెను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ విజయం వెనక చంద్రబాబు హస్తం ఉందని భావిస్తున్నారా ..??#Chandrababu #RahulGandhi #RevanthReddy #TelanganaAssemblyElectionResults2023 #ElectionResults #ElectionResults2023 #AssemblyElections2023 #ResultsWithOneindia #Oneindiatelugu
— oneindiatelugu (@oneindiatelugu) December 3, 2023
ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని రోజా చెప్పారు . కాని ఫైనల్లో ఇండియా ఓడిపోయింది. అప్పుడు కూడా రోజా ఇదే విధంగా విమర్శలను ఎదుర్కొన్నారు.రోజా చేసిన వ్యాఖ్యల కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రోజానే ప్రధాన కారణమని నెటిజన్లు తేల్చేశారు.












Click it and Unblock the Notifications