ప్రేమతో వస్తే..అవమానించారు: కేసీఆర్ ఆఫీస్ వద్ద ఆంధ్రా ఎంపీని ఎండలో నిలబెట్టారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయ సిబ్బంది తనను ఎండలో నిలబెట్టి అవమానించారని ఏపీలోని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు బుధవారం ఆరోపించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంప్ కార్యాలయ సిబ్బంది తనను ఎండలో నిలబెట్టి అవమానించారని ఏపీలోని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు బుధవారం ఆరోపించారు.
ఆయన తన కూతురు వివాహానికి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ క్యాంప్ కార్యాలయ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన మాట్లాడారు.

తనను గేటు వద్ద ఆపి అవమానించారని రవీంద్ర బాబు ఆరోపించారు. ఐడీ కార్డు చూపినా లోపలకు పోకుండా ఎండలో నిలబెట్టారన్నారు. తాను కేసీఆర్ పైన ప్రేమ, అభిమానంతో వచ్చానని చెప్పారు. సీఎం కార్యాలయ సిబ్బందికి కేసీఆర్ ప్రోటోకాల్ నేర్పించాలన్నారు.












Click it and Unblock the Notifications