ఏపీ-తెలంగాణ 'ఎంసెట్' మాత్రమే వేరు : టాపర్స్ మారలేదు

హైదరాబాద్ : ఓవైపు నీట్ గందరగోళం.. మరోవైపు ఎంసెట్.. మొత్తానికి నీట్ వాయిదాపడడం, తెలంగాణ ఏపీల్లో ఎంసెట్ పరీక్ష జరగడం జరగిపోయాయి. అయితే ఇరు రాష్ట్రాల్లో వేర్వేరుగా పరీక్ష జరిగినా.. రెండు రాష్ట్రాల ఎంసెట్ లోను టాపర్లు ఒక్కరే కావడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కాస్త అటు, ఇటుగా ఇరు రాష్ట్రాల ఎంసెట్ టాపర్ల జాబితా ఒకలాగే ఉండడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దీనికి కారణం ఇరు రాష్ట్రాల్లోని చాలామంది విద్యార్థులు రెండు ఎంసెట్ పరీక్షలకు హాజరవడమే. దీంతో టాప్ ర్యాంకర్ల జాబితాలోను పెద్దగా మార్పులేవి చోటు చేసుకోకపోవడం గమనార్హం.

ap-telangana the exam only seperate : toppers list was almost same

ఇక ర్యాంకుల విషయాన్ని పరిశీలిస్తే.. తెలంగాణ ఎంసెట్ లో టాపర్ గా నిలిచిన సాయితేజ, ఏపీ ఎంసెట్ లో 7వ ర్యాంకును సాధించాడు. అలాగే తెలంగాణ ఎంసెట్ లో 10వ ర్యాంకు సాధించిన వంశీకృష్ణ ఏపీ ఎంసెట్ లో టాపర్ గా నిలిచాడు. ఇక తెలంగాణ ఎంసెట్ లో 4వ ర్యాంకు సాధించిన విఘ్నేష్ రెడ్డి ఏపీ ఎంసెట్ లో 3వ ర్యాంకు సాధించాడు.

ap-telangana the exam only seperate : toppers list was almost same

తెలంగాణ ఎంసెట్ టాప్ 10 లో 2,8,9 ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏపీ ఎంసెట్ లో 6,5,10 ర్యాంకులను సాధించారు. మెడికల్ విభాగంలోను పరిస్థితి ఇలాగే ఉంది. తెలంగాణ ఎంసెట్ లో 5వ ర్యాంకు సాధించిన యజ్ఞప్రియ, ఏపీ ఎంసెట్ లో 3వ స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణ మెడికల్ లో 9వ ర్యాంకును కైవసం చేసుకున్న శైలజ, ఏపీ ఎంసెట్ లో 7వ ర్యాంకును సొంతం చేసుకుంది.

ap-telangana the exam only seperate : toppers list was almost same

మొత్తంగా ఆరుగురు తెలంగాణ అబ్బాయిలు అటు ఏపీ ఎంసెట్ లోను, ఇటు తెలంగాణ ఎంసెట్ లోను టాప్-10 లో చోటు దక్కించుకున్నారు. ఇక మెడికల్ విభాగంలో ఇద్దరు తెలంగాణ అమ్మాయిలు ఏపీ ఎంసెట్ టాప్-10 జాబితాలోను చోటు సంపాదించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+