రోజా ఇంట్లో రాగిసంగటి: కేసీఆర్ బలుపు మాటలు -34శాతానికి హరీశ్ తలూపలేదా? :రేవంత్ రెడ్డి ఆగ్రహం

కృష్ణా జలాల వినియోగం విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పాలక పార్టీల మధ్య కొనసాగుతోన్న వివాదం పచ్చి బూటకమని, ఇది ముమ్మాటికీ జగన్ తో కలిసి కేసీఆర్ ఆడుతోన్న డ్రామా అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. జల వివాదాలకు సంబంధించి ప్రస్తుతం రచ్చకు కారణమైన అంశాలను కాంగ్రెస్ పార్టీ గతం నుంచే ప్రశ్నిస్తూ వస్తున్నదని, ఆనాడు వైసీపీ ఎమ్మెల్యేలతో అంటకాగిన కేసీఆర్, హరీశ్ రావులు ఇవాళ యూటర్న్ వ్యాఖ్యలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.

ఈనెల 9న కేసీఆర్ పోతారా?

ఈనెల 9న కేసీఆర్ పోతారా?


''రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జగన్ సర్కారు 203 జీవో ఇచ్చిననాటి నుంచే కాంగ్రెస్ ప్రశ్నించింది. అప్పుడు సీఎం కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. సీమ ఎత్తిపోతల పథకానికి జగన్ రూ.7 వేల కోట్లు కేటాయించినప్పుడూ మేం గొడవ చేశాం, అప్పుడు కూడా కేసీఆర్ మౌనంగా ఉన్నాడు. చివరికి రాయలసీమ ఎత్తిపోతలపై పాలమూరు రైతులే పోరాటానికి దిగి, ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చారు. అయినాసరే ముఖ్యమంత్రిలో చలనం రాలేదు. అసలు కృష్ణా జలాల పరిరక్షణ కంటే పెద్ద పనులు కేసీఆర్ కు ఏమున్నాయి? ఈ నెల 9న కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (కేఆర్ఎంబీ) సమావేశానికి సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లరు? ఆ మీటింగ్ వాయిదా వేయాలనడం వెనుక కేసీఆర్ మతలబేంది? పరిష్కారం లభిస్తే రాజకీయాలు నడవబోవనే భయమేనా?

66:34 ఫార్ములాకు తలూపిందెవరు?

66:34 ఫార్ములాకు తలూపిందెవరు?

కృష్ణా జలాలపై కేసీఆర్ లేని వివాదాన్ని సృష్టిస్తున్నాడు. కేసీఆర్ అనుమతి తీసుకున్న తర్వాతే జగన్ రాయలసీమ ప్రాజెక్టును ప్రారంభించాడు. కృష్ణా జలాల్లో ఏపీ 66శాతం, తెలంగాణ 34శాతం వాడుకుంటామని సంతకాలు చేసిన కేసీఆరే ఇప్పుడు మళ్లీ 50:50 ఫార్ములా కావాలనడమేంటి? గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్ రావు తెలంగాణకు 34 శాతం కృష్ణా నీళ్లు సరిపోతాయని అనడం రికార్డుల్లో ఉంది. ఈ మేరకు మంత్రి హోదాలో హరీశ్ సంతకం కూడా పెట్టారు. ఏడేళ్ల పాటు 299 టీఎంసీలే వాడుకుని, ఇప్పుడు కొత్తగా 50:50 వాదనను తెరపైకి తేవడం, బోర్డు మీటింగ్ వాయిదా కోరడం రాజకీయం కాక మరేంటి? నిజంగా అంత వాటా కావాలనుకుంటే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కేసీఆర్, కేటీఆర్ ఆమరణ దీక్ష చేయాలి. మరి సిద్ధమేనా? గతంలో..

Recommended Video

    Manda krishna said the only one to hold a Dalit empowerment conference to divert public attention
    రోజా ఇంట్లో రాగి సంగటి తిని..

    రోజా ఇంట్లో రాగి సంగటి తిని..


    గతంలో సీఎం కేసీఆర్ తిరుమల సందర్శనకు వెళ్లిన సమయంలో నగరి ఎమ్మెల్యే రోజా ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. రోజా పెట్టిన రాగిసంగటి, నాటుకోడి పులుసు తిన్న కేసీఆర్.. ఏపీ, తెలంగాణ మధ్య బేసిన్లు లేవు, భేషజాలు లేవు.. రాళ్ల సీమ లాంటి రాయలసీమను రతనాల సీమ చేస్తా... ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తా.. అని బలుపు మాటలు మాట్లాడింది నిజం కాదా? నేను ఆనాడే కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిచా. రోజా ఒక్కసారి రాగిసంగటి, నాటుకోడి పులుసు పెడితేనే విభేదాలు లేవన్న కేసీఆర్ కు నాడు ఈ బేసిన్ల కోసమే 1200 మంది విద్యార్థులు ఆత్మబలిదానం చేసుకున్న సంగతి తెలియదా? బేసిన్లు, భేషజాలు లేకపోతే ఇంత మంది ప్రాణత్యాగాలతో తెలంగాణ ఉద్యమం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాన్ని ప్రశ్నించిన వాళ్లందరినీ కేసీఆర్, ఆయన భయజ బృందం చిల్లరగాళ్లని తిట్టేవాళ్లు. మరి ఇప్పుడు వాళ్లు చేస్తున్నదేంటి?'' అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+