టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు
హైదరాబాద్: సాప్ట్‌వేర్ ఇంజనీర్‌కు అరుదైన గుండెమార్పిడి చికిత్సను అపోలో వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. టెర్మినల్ హార్ట్ డిసీజ్‌తో బాధపడతున్న 35 ఏళ్ల నవీన్‌కుమార్ అనే వ్యక్తికి ప్రముఖ సీనియర్ హార్ట్, లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలోని వైద్య బృందం ఈ శస్త్ర చికిత్సను ఫిబ్రవరి 26న విజయవంతంగా నిర్వహించింది.
శుక్రవారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోగిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె మార్పిడి నిపుణులు డా. గోపాలకృష్ణ గోఖలే వివరాలను వెల్లడించారు. యాక్సెంచర్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పని చేస్తున్న నవీన్‌కుమార్ నాలుగేళ్లుగా డైలేటెడ్ కార్డియోమయోపతితో బాధపడుతున్నాడు.
ఈ వ్యాధి వల్ల ఉద్యోగానికి రాజీనామా కూడా చేశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న బాధితుడికి గడిచిన ఆరునెలల్లో మూడు సార్లు వైద్యులు చికిత్స అందించారు. జనవరి 18న అపోలో హాస్పిటల్‌కు వచ్చినప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసియులో చేర్పించి చికిత్స ప్రారంభించారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు
పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ గోఖలే, డాక్టర్ మనోజ్ అగర్వాల్ రోగిని పరీక్షించి గుండె మార్పిడి అనివార్యమని తేల్చారు. అతని పేరును జీవన్‌దాన్‌లో నమోదు చేయించారు. ఫిబ్రవరి 25న బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయువాలను దానం చేసేందుకు ఆ కుటుంబీకులు ముందుకు వచ్చారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు
అయితే మృతుడి బ్లడ్‌ప్రెషర్ చాలా తక్కువగా ఉండటం వల్ల అతని నుంచి సేకరించిన గుండెను మరో రోగికి అమర్చడం వీలుకాలేదు. రోగి బీపీ కూడా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. ఆ తర్వాత గుండెను సేకరించడానికి ముందు ఎక్కువ మోతాదులో ఔషధాలు అందించి బీపీని నిలకడగా ఉండేలా ఏర్పాటు చేశారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు
అనంతరం అత్యంత సాహసంతో ఆ గుండెను సేకరించి నవీన్‌కు అమర్చినట్లు గోఖలే తెలిపారు. ఎనిమిది గంటల సమయం పట్టినట్లు వివరించారు. శస్త్రచికిత్స పూర్తయిన 48గంటల్లోనే రోగిలో కదలికలు వచ్చాయన్నారు. ప్రస్తుతం నవీన్ పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు.

టెక్కీకి అరుదైన గుండెమార్పిడి ఆపరేషన్ చేసిన అపోలో వైద్యులు
మన దేశంలో ఇప్పటి వరకు కేవలం 250 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు మాత్రమే జరిగినట్లు వివరించారు.ఈ సమావేశంలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న నవీన్‌తో పాటు అతడి భార్య అన్నపూర్ణ, ఏడాదిన్నర కుమారుడు లక్షిత్‌తో పాటు అపోలో వైద్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం రోగి సాధారణ జీవితం గడుపుతున్నారు.












Click it and Unblock the Notifications