ఆయన కేసీఆర్ ఫ్యాన్, స్వయంగా చెప్పారు: ఎందుకంటే..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణియన్ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభిమాని అయిపోయారు. ఈ విషయాన్ని ఆయనే కేసీఆర్‌తో స్వయంగా చెప్పారు.
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీకి కేసిఆర్ వచ్చిన సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఆయన కేసీఆర్‌కు ఎదురు పడ్డారు. కేసీఆర్‌ను ఆయన పలకరించారు.

ఆ పథకం భేషుగ్గా ఉంది
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ పెట్టుబడి మద్దతు పథకం అద్భుతంగా ఉందని సుబ్రహ్మణియన్ కితాబు ఇచ్చారు. కేసీఆర్ పనితీరుపై ప్రశంసల జల్లు కురిపించరు. నేను మీ అభిమానిని అయిపోయానని ఆయన కేసీఆర్‌తో చెప్పారు. రైతులకు అండగా నిలిచే పథకంగా దాన్ని ఆయన అభివర్ణించారు.

ఇది అధ్యయనం చేయాల్సిన స్కీమ్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణియన్ అన్నారు. ఇది రైతులకు పెద్ద ఊరట కలిగిస్తుందని, ఎకరానికి రూ. 4 వేల చొప్పున రెండు పంటలకు రూ. 8 వేల చొప్పున అందించడం విశేషమనిఅన్నారు

ఇది మోడల్ పథకమే
తెలంగాణ మోడల్ పథకాన్ని కేంద్రం ప్రభుత్వం కూడా అధ్యయన చేయాలని తాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెప్పినట్లు సుబ్రహ్మణియన్ తెలిపారు. వచ్చే సోమవారంనాడు తాను హైదరాబాద్ వస్తానని, ఆ రోజు మీతో ప్రత్యేకంగా చర్చిస్తానని ఆయన కేసీఆర్‌తో చెప్పారు.

మా ఇంటికి భోజనానికి రావాలి
రాష్ట్రాధికారులు పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తారని, క్షుణ్నంగా చర్చిస్తారని కేసీఆర్ సుబ్రహ్మణియన్‌తో చెప్పారు హైదరాబాద్ వచ్చినప్పుడు తమ ఇంటికి భోజనానికి రావాలని కేసీఆర్ ఆయనను ఆహ్వానించిరు.












Click it and Unblock the Notifications