కంచ ఐలయ్యను అరెస్ట్ చేయకుంటే: ఆర్య వైశ్య సంఘం
వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఏపీ అధ్యక్షులు టిజి భరత్ సోమవారం ఫిర్యాదు చేశారు.
కర్నూలు/హైదరాబాద్: వైశ్యులపై వివాదాస్పద పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ఆర్య వైశ్యుల హక్కుల సాధన సమితి ఏపీ అధ్యక్షులు టిజి భరత్ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పుస్తకం నిషేధించాలి
ఈ సందర్భంగా టిజి భరత్ మాట్లాడారు. ఆర్య వైశ్యులపై రాసిన పుస్తకాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. కంచ ఐలయ్యను అరెస్టు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

చర్చకు ఏక్కడైనా సిద్ధం
కంచ ఐలయ్య రాసిన పుస్తకంపై తాము ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆర్య వైశ్య సంఘం ప్రకటించింది. ఈ విషయమై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ పుస్తకాన్ని వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు.

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఐలయ్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్య వైశ్య సంఘం డిమాండ్ చేసింది. ఐలయ్య పుస్తకంలోని అవాస్తవాలపై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమని తెలిపింది. ఆర్యవైశ్యులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

పుస్తకంపై విమర్శలు
కంచ ఐలయ్య పుస్తకం సమాజ విచ్ఛిన్నానికి కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, వైశ్యులపై కంచ ఐలయ్య వివాదాస్పద పుస్తకం రాశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఆర్య వైశ్య సంఘం మాత్రం తగ్గడం లేదు.












Click it and Unblock the Notifications