KTR:ఇదొక ఇంజినీరింగ్ కళాఖండం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అమెరికా సంస్థ ప్రశంసలు

హైదరాబాద్: తెలంగాణ జీవనాడిగా పిలుచుకునే ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు మరోసారి వార్తల్లో నిలిచింది. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు‌ను అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ (ASCE) కొనియాడింది. ఇదొక అద్భుతమైన ప్రాజెక్టుగా అభివర్ణించింది.1852లో అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ సంస్థ ఏర్పాటైంది.

అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌ను అభినందించిన అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్, నెవెడాలో జరిగిన వరల్డ్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ వాటర్ రీసోర్స్ కాంగ్రెస్‌లో ఆయన్ను అభినందిస్తూ ఒక జ్ఞాపికను బహూకరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అత్యుత్తమ ఇంజనీరింగ్ పరిజ్ఞానానికి తార్కాణంగా నిలిచిందని చెప్పారు ఏఎస్‌సీఈ అధ్యక్షులు మారియా లెమాన్.

ktr-

ఇక సభను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం ఎన్నో అంశాలతో ముడిపడి ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాలు కళ్లముందు కనిపిస్తాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఇన్ని అద్భుతాలు సాధ్యమయ్యాయంటే దీని వెనకున్న నాయకుడి ఆలోచనలే అని కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్ట్, మిషన్ భగీరథలు అత్యంత సమర్ధతతో, ఖర్చుతో కూడుకున్నవని అయితే రికార్డు సమయంలో పూర్తిచేసినట్లు మంత్రి కేటీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు.

తెలంగాణ గత తొమ్మిదేళ్లలో అసాధరణ మైలు రాళ్ళను సాధించిందని చెప్పిన మంత్రి కేటీఆర్.. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా ఉందని వెల్లడించారు. ఇక దేశంలో ధాన్యం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని అంతకుముందు 24వ స్థానంలో ఉండేదని కేటీఆర్ గుర్తుచేశారు. ఇక దేశంలో తమ పౌరులకు ఉచిత తాగు నీరు అందిస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే అని కేటీఆర్ చెప్పారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమించారని అప్పుడే రాష్ట్ర ప్రగతిపై తనకు స్పష్టమైన విజన్ ఉన్నిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ వ్యూహాత్మకమైన ప్రణాళిక,సృజనాత్మక ఆలోచనలు, వాటిని అమలు చేసిన విధానంతో తన విజన్‌కు తగ్గ ప్రతిఫలం నేడు దక్కిందని కేటీఆర్ అన్నారు. రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడమే కేసీఆర్ విజన్‌ ఉన్న నాయకుడని చెప్పేందుకు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+