కరోనాతో ఏఎస్ఐ మృతి, పాఠశాలల్లో కరోనా ఉధృతి: సింగరేణి కార్మికులకు ఉచిత కరోనా వ్యాక్సిన్
హైదరాబాద్: దేశంలో మరోసారి కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా స్వల్పంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా బారినపడి సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా, తెలంగాణలో ఓ ఏఎస్ఐ కరోనా బారినపడి మరణించారు.

కరోనాతో ఏఎస్ఐ మృతి..
కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యాదగిరికి కరోనా సోకింది. దీంతో ఆయనను హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. కాగా, యాదగిరి మహాశివరాత్రి రోజున వేములవాడలో బందోబస్తు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. పెద్దపల్లిలోని ఇంటికి వచ్చాక శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడటంతో.. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం ఏఎస్ఐ యాదగిరి మృతి చెందారు.

పాఠశాలల్లో కరోనా విజృంభణ.. బైంసాలో పది మందికి..
ఇది ఇలావుండగా, మంగళవారం ఒక్కరోజే పలు పలు పాఠశాలల్లో 104 కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. తాజాగా, నిర్మల్ జిల్లా బైంసాలోని గురుకుల పాఠశాలలో 10 మంది కరోనా బారినపడ్డారు. వారిలో 9 మంది విద్యార్థులు ఉండగా, ఒకరు పాఠశాల సిబ్బంది ఉన్నారు. తెలంగాణలో కొత్తగా 247 కరోనా కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 1659కి చేరింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 2101 యాక్టివ్ కేసులున్నాయి.

సింగరేణి కార్మికులకు ఉచిత కరోనా వ్యాక్సిన్
సింగరేణి కార్మికులు, వారి కుటుంబసభ్యులకు త్వరలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయనున్నారు. సింగరేణి సీఎండీ శ్రీధర్ చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వ్యాక్సినేషన్ కోసం సింగరేణి ఏరియాల్లోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలను సిద్దం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సీఎండీకి లేఖ రాసింది. కాగా, ఏరియా ఆస్పత్రులు, డిస్పెన్సరీలను వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే సిద్ధం చేసినట్లు సంస్థ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ మంత శ్రీనివాస్ తెలిపారు. రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన, బీపీ, షుగర్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి టీకా ఇవ్వనున్నట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డుతోపాటు సంస్థ ఇచ్చిన వైద్య గుర్తింపు కార్డును తీసుకురావాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications