లాస్ట్ మినిట్ లో బిగ్ ట్విస్ట్, ఆ పార్టీ వైపే మొగ్గు - ఈ 48 గంటల్లో సీన్ మార్చేలా..!!
తెలంగాణలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతోంది. హోరా హోరీగా సాగుతున్న ప్రచారం మరి కొద్ది గంటల్లో ముగియనుంది. ఫలితం తేల్చే పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ 48 గంటలకు రాజకీయ పార్టీలకు కీలకంగా మారుతోంది. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కొనసాగుతోంది. చివరి రెండు రోజుల్లో రాజకీయంగా కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఇక ఎలక్షనీరింగ్ గెలుపు ఓటమి లను డిసైడ్ చేయనున్నాయి.
ఈ 48 గంటలే కీలకం:తెలంగాణ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. ప్రచారం ఈ సాయంత్రం ముగియనుంది. సరిగ్గా పోలింగ్ కు 48 గంటల సమయం ఉంది. ఎన్నికల హామీలు...హోరెత్తిన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేసిన పార్టీలు ఇప్పుడు చివరి దశ వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఈ నెల 30న జరిగే పోలింగ్ కోసం క్షేత్ర స్థాయిలో పార్టీల సీనియర్లు కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగారు.

ఇప్పటికే మెజార్టీ సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ ఈ సర్వేలను లెక్క చేయటం లేదు. గెలుపు తమనేదని ధీమా వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ 80 సీట్లకు పైగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేస్తోంది. అనూహ్యంగా చివరి రెండు రోజుల్లో బీజేపీ పుంజుకుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. బీజేపీ 30 స్థానాల్లో దక్కించుకొనే ఓట్లు మొత్తంగా ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
పోల్ మేనేజ్ మెంట్ పై ఫోకస్:ఇక, ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే..ఈ 48 గంటలు గేమ్ ఛేంజర్ గా పార్టీలు భావిస్తున్నాయి. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ పైనే దృష్టి పెట్టాయి. తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటుగా కేసీఆర్ పాలన పైన ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రచారం ఓట్లుగా మారితే కాంగ్రెస్ గెలుపు ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి.
ఇక, ఎన్నికల్లో సహజంగా చివరి నిమిషంలో ఎలక్షనీరింగ్ ప్రభావం చూపిస్తుంది. దీని పైన ఇప్పుడు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. క్షేత్ర స్థాయి నివేదికలతో ప్రచారం కంటే ఈ ఎలక్షనీరింగ్ పైనే బీఆర్ఎస్ ఫోకస్ చేసింది. కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య నువ్వా - నేనా అన్నట్లుగా సాగుతున్న పోటీలో ప్రతీ సీటు..ఓటు కీలకంగా మారుతోంది. ఎవరు అధికారంలోకి వచ్చినా భారీ మెజార్టీ ఉండదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
మారుతున్న లెక్కలు:ఇక్కడ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత వారం రోజులుగా బీజేపీ మద్దతు గతం కంటే పెరిగినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ, మున్నూరు కాపు ఓటింగ్ తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఉత్తర తెలంగాణ పై కాంగ్రెస్ ఈ సారి ప్రత్యేకంగా ఫోకస్ చేసింది.
అది వర్కవుట్ అయి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తే అధికారం ఖాయమని భావిస్తోంది. ఉత్తర తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ కు 43 సీట్లు వచ్చాయి. ఈ ప్రాంతం ఇప్పుడు అధికారం డిసైడ్ చేయనుంది. అయితే, అదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీకి మద్దతు పెరిగినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో..ఈ 48 గంటల్లో పార్టీల స్కిల్ కీలకంగా మారుతోంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications