అసెంబ్లీ వేదికగా రేవంత్ అనూహ్య నిర్ణయం..!!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. సభకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరు అయ్యారు. గవర్నర్ ప్రసంగం తరువాత వెళ్లిపోయారు. కేసీఆర్ రోజు సభకు హాజరవుతారా లేక బడ్జెట్ రోజున వస్తారా అనేది తేలాల్సి ఉంది. గవర్నర్ ప్రసంగం పైన బీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారని వ్యాఖ్యానించారు. ఇక, సమావేశాల నిర్వహణ పైన బీఏసీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 19న బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి.
సమావేశాల అజెండా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి. ప్రభుత్వ లక్ష్యాలను గవర్నర్ తన ప్రసంగంలో వివరించారు. గవర్నర్ ప్రసంగ పాఠం పైన బీఆర్ఎస్ నిరసన వ్యక్తం చేసింది. గవర్నర్ తో రైతు రుణ మాఫీతో సహా పలు అంశాల పైన అసత్యాలు చెప్పించారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ అజెండా పైన చర్చించారు. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 19న అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈ బడ్జెట్ లో ఈ సారి యువతకు సంబంధించిన పథకాల పైన ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీఏసీ భేటీలో
ఇక, స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన బీఏసీ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, సీపీఐ నుంచి కూనమనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు సమావేశాల అజెండా ను ఖరారు చేసారు. ఈ నెల 13(రేపు) గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉండనుంది. కాగా, ఈ నెల 14 హోలీ సెలవు ప్రకటించారు. 15 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, సమాధానం ఇవ్వనున్నారు. తిరిగి 16న సెలవు. 17,18న ప్రభుత్వ బిజినెస్ చేపడతారు.
19న బడ్జెట్
ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశ పెట్టాలని నిర్ణయించారు. ఆ మరుసటి రోజు 20న సెలవు. ఇక, 21న బడ్జెట్‌పై సాధారణ చర్చ మొదలు పెట్టనున్నారు. 22,24,25,26 పద్దులపై చర్చ ఉంటుంది. ఆ తరువాత 27 ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ .. ఆమోదం తో సమావేశాలు ముగియనున్నారు. ఈ బీఏసీ సమావేశంలో సభను 20 రోజులు తగ్గకుండా నిర్వహించాలని కోరినట్లు హరీష్ చెప్పారు. మంత్రులు సైతం అంశాల పైన సిద్దమై రావాలని కోరారు. ప్రతిపక్ష పార్టీకి సైతం మాట్లాడే ఛాన్స్ సభలో ఇవ్వాలని స్పీకర్ ను కోరినట్లు వెల్లడించారు. కాగా, సభకు కేసీఆర్ రోజు హాజరవుతారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications