ఆ ఇద్దరు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం. సుప్రీం తాజా ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ల పై స్పీకర్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కు దగ్గర అయిన ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ అనూహ్యంగా స్పందించారు. ఇప్పటికే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఒక ఎమ్మెల్యే రాజీనామా పై తుది నిర్ణయం కోసం ఢిల్లీ వెళ్లారు. కాగా.. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తి కరంగా మారుతోంది.
పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయగా.. అందులో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్‌లు దాఖలు చేయలేదు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి.. స్పీకర్ నోటీసులకు స్పందించలేదు. దీంతో.. ఆ ఇద్దరికీ స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అనర్హత పిటిషన్లపై అఫిడవిట్ దాఖలు చేయాలని నిర్దేశించారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ఎమ్మెల్యేల విచారణ నేటితో (గురువారం)తో ముగియనుంది. కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం సీరియస్ అవడంతో పాటు నాలుగు వారాలు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో వేగం పెంచాలని అసెంబ్లీ స్పీకర్ నిర్ణయించారు.

అందులో భాగంగా రెండో విడత విచారణలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలను విచారణకు పిలి చారు. ఉదయం ఎమ్మెల్యేల విచారణ మొదలైంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్సెస్ జగదీశ్ రెడ్డి కేసును స్పీకర్ విచారించారు. ఇరు వర్గాల ఓరల్ ఆర్గ్యుమెంట్స్‌ను స్పీకర్ విన్నారు. అలాగే మధ్యాహ్నం అరికెపూడి గాంధీ వర్సెస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కేసు విచారించనున్నారు. వీరి విచారణతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి అవుతుంది. ఇదే సమయంలో
ఎమ్మెల్యే దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దలను కలవనున్నారు. విచారణకు హాజరైతే వేటు పడుతుందని దానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. వేటు పడితే ఆరు సంవత్సరాల పాటు పోటీ చేయడానికి నో ఛాన్స్. ఈ క్రమంలో రాజీనామా చేసేందుకు దానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని పార్టీ పెద్దలతో దానం సంప్రదింపులు జరుపనున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో, ఒకటి రెండు రోజుల్లోనే వీరి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications