తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం.. హాజరైన సీఎం రేవంత్, ప్రముఖులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం రాత్రి నిర్వహించిన 'ఎట్ హోం' కార్యక్రమంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తేనేటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులతోపాటు స్పీకర్ ప్రసాద్ కుమార్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్ సుజయ్ పాల్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఉన్నతాధికారులు, త్రివిధ దళాలకు చెందిన సీనియర్ అధికారులు, పుర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
The Hon’ble Governor Shri Jishnu Dev Varma, extended a warm welcome to the distinguished guests and dignitaries at the “At Home” reception held on the occasion of Republic Day.
— Governor of Telangana (@tg_governor) January 26, 2025
Presented the Governor’s Excellence Awards 2024 to the distinguished persons and organizations. pic.twitter.com/Qd35GjVgAO
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, సంస్కృతి, క్రీడా రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలకు రాజ్‌భవన్ చరిత్రలో తొలిసారిగా "గవర్నర్ ఎక్సలెన్స్" 2024 పేరిట నెలకొల్పిన అవార్డులను 'ఎట్ హోమ్' కార్యక్రమంలో అందజేశారు. ఆయా రంగాల్లో చేసిన విశిష్ట సేవలకు గాను దుశ్చర్ల సత్యనారాయణ, అరెకపూడి రఘు, దీప్తి జివాంజి, కృష్ణభారతి, ప్రొ. పాండురంగారావు గవర్నర్ గారి చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందిస్తున్న ధ్రువాంశ్ సంస్థ, ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, ఆదిత్య మెహతా ఫౌండేషన్, సంస్కృతి ఫౌండేషన్ లు అవార్డులకు ఎంపిక కాగా వాటి ప్రతినిధులు అవార్డులను అందుకున్నారు. అలాగే, ఐఎఫ్ఎస్ అధికారి డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి "స్పెషల్ లైఫ్ టైమ్ అవార్డు"ను అందుకున్నారు.
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ సందేశం
ప్రజా పాలనలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారంనాడు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ పథకాల ప్రారంభం సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ వీడియో ద్వారా సందేశమిచ్చారు. ఈ వీడియో సందేశాన్ని గ్రామ సభల్లో అధికారులు ప్రదర్శించారు.

రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ, ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవం రోజు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.
రైతు భరోసా, నిరుద్యోగ సమస్య పరిష్కారం, వరికి బోనస్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, రూ.500కు సిలిండర్ వంటి కార్యక్రమాలతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు అదే విధంగా బలహీన వర్గాలు మైనారిటీలు మహిళలు నిరుపేదలందరినీ కూడా ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రేవంత్ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు.
-
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది నేనే: మాజీ మంత్రి మల్లారెడ్డి -
శుభవార్త: రేషన్ కార్డులు ఉన్నవారందరికీ 5లక్షల జీవిత బీమా.. పూర్తి వివరాలివే! -
హరీష్ కు రేవంత్ ఘాటు కౌంటర్-సిద్దిపేటకు మంత్రి ఆఫర్..! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications