హైదరాబాద్ ఎల్బీ నగర్‌లో దారుణం.. గోడకూలి ముగ్గురు మృతి
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ హోటల్ సెల్లార్‌లో తవ్వకాలు చేపడుతుండగా గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మట్టిపెడ్డల కింద పడి మరణించగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది స్పాట్‌కి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు.
గాయపడిన వ్యక్తిని శిథిలాలు తొలగించి బయటకు తీశారు. చికిత్స కోసం కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులు బీహార్‌కి చెందిన వారుగా గుర్తించారు. చనిపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. మరో ఇద్దరి మృతదేహలను బయటికి తీసేందుకు శిథిలాలను తొలగిస్తున్నారు.













Click it and Unblock the Notifications